తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: సిర్పూర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిర్పూర్ ఒకటి. ఈ నియోజకవర్గం ఉమ్మడి అదిలాబాద్ నియోజకవర్గంలో ఉంది. ప్రస్తుతం కొమురంబీమ్ జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి 2014లో బీఎస్పీ తరఫున కోనేరు కోనప్ప గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కావేటి సమ్మయ్య పైన కోనప్ప గెలిచారు. కోనప్పకు 49,033 ఓట్లు వస్తే, తెరాస అభ్యర్థి కావేటి సమ్మయ్యకు 40,196 ఓట్లు వచ్చాయి. 1962 నుండి 1999 వరకు వరుసగా ఒక్కో అభ్యర్థి రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచారు. 1962 నుంచి 1978 మధ్య నాలుగుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, 1983, 1985, 1999లలో టీడీపీ అభ్యర్థులు గెలవగా, 2004లో తిరిగి కాంగ్రెస్ గెలిచింది. 2014లో గెలిచిన కోనేరు కోనప్ప ఆ తర్వాత తెరాసలో చేరారు.













Click it and Unblock the Notifications