ఏపీలో కరోనా మరణ మృదంగం.. 118 మంది మృత్యువాత.. 20 వేల వరకు పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. పాజిటివ్ కేసులే కాదు.. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. గత కొన్నిరోజుల నుంచి ఇలా మరణాలు జరుగుతున్నాయి. గత 24 గంటల్లో వందకు పైగా మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో వైరస్ సోకిన 118 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది, చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు.

రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటింది. తాజా మరణాలతో కలిపి 10,022గా నమోదైంది. రోజువారీ కేసులను పరిశీలిస్తే.. 90,609 కరోనా పరీక్షలు నిర్వహించగా 19,981 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వచ్చాయి. ఇతర జిల్లాల్లో పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,683 మందికి చికిత్స కొనసాగుతోంది.

118 people dead in ap who tested corona positive

Recommended Video

    New Coronavirus Found In Malaysia That Can Transfer From Dogs To Humans || Oneindia Telugu

    ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060కి చేరింది. వీరిలో 13,41,355 మంది కరోనా నుంచి కోలుకుని కోలుకున్నారు. కరోనా మరణాలు కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఇలా ఉండగా.. బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్ కేసులు వస్తున్నాయి. వీటిని నిర్ధారించి.. చికిత్స అందిస్తున్నారు. త్వరగా గుర్తిస్తే మేలు అని.. లేదంటే ఇబ్బందులు తప్పవని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+