ఏపీలో మరింత తగ్గిన కేసులు.. 136 కేసులు నమోదు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వేల నుంచి వందలకు వచ్చేశాయి. రెండు, మూడు వందల వరకు కేసులు రావడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అలాగే దేశవ్యాప్తంగా కూడా గణనీయంగా కేసులు తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి మరింత తగ్గుతోంది. గత 24 గంటల్లో 200కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. 15,654 కరోనా పరీక్షలు నిర్వహించగా, 136 మందికి పాజిటివ్ వచ్చింది.
గుంటూరు జిల్లాలో 26, తూర్పు గోదావరి జిల్లాలో 25, కృష్ణా జిల్లాలో 21 కేసులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 803 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,741 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,00,165 మంది కోలుకున్నారు. ఇంకా 2,850 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,726కి పెరిగింది.

ఇటు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో శనివారం కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ తదితర కారణాలతో 243 మంది మరణించారు, దీంతో కోవిడ్ వల్ల మరణించినవారి సంఖ్య 5,13,724కి చేరింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.54 శాతానికి మెరుగు పడింది.
ఇటు నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని కాన్పూర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్ తీవ్రత ఆధారపడి ఉంటుందని వివరించారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయన్నారు. దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. కరోనా థర్డ్‌వేవ్ విషయంలో కొద్ది రోజుల తేడాతో కచ్చితమైన అంచనా వేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications