ఏపీలో కరోనా తగ్గుముఖం.. 220 కేసులు.. ఇద్దరు మృతి
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 17వేల 735 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 220 మందికి పాజిటివ్ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 43, కృష్ణా జిల్లాలో 40, గుంటూరు జిల్లాలో 36, తూర్పు గోదావరి జిల్లాలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి. 472 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారు.
చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,184 పాజిటివ్ కేసులు రాగా..22,97,537 మంది కోలుకున్నారు. 4 వేల 927 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 14వేల 720కి చేరింది. ఇవాళ్టి వరకు 3,30,47,859 కరోనా టెస్టులు చేశారు.

ఇటు దేశవ్యాప్తంగా కూడా కరోనా అదుపులోనే ఉంది. బుధవారం 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 14 వేల 148 మందికి పాజిటివ్ వచ్చింది. ముందురోజు కంటే కేసులు 6 శాతం తగ్గాయి. పాజిటివిటీ రేటు 1.22 శాతానికి క్షీణించింది. 24 గంటల వ్యవధిలో మరో 302 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 2020 జనవరి నుంచి 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 5,12,924 మరణాలు సంభవించాయి.
వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 0.35 శాతానికి పడిపోయాయి. నిన్న ఒక్కరోజే 30 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4.22 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.46 శాతానికి పెరిగింది. ఇక నిన్న 30 లక్షల మంది టీకా తీసుకోగా.. 13 నెలల వ్యవధిలో 176 కోట్లకుపైగా డోసులు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications