అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో నిన్నటికన్నా కాస్త పెరిగిన కరోనా.. అయినా కేసులు తక్కువే.. ఇద్దరు మృతి

|
Google Oneindia TeluguNews

కరోనా తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా కేసుల ప్రభావం తగ్గింది. దాదాపు అందరూ సెకండ్ డోసు వేసుకోవడం.. కొందరు బూస్టర్ డోసు వేసుకోవడంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో ఏపీ ప్రభుత్వం నిబంధనలు, ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు.

గత 24 గంటల్లో 18 వేల 915 కరోనా పరీక్షలు చేశారు. 496 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో 3,30,66,774 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14 వేల 722కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,464 చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,98,033గా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 4 వేల 709గా ఉంది.

280 people infected coronavirus in andhra pradesh

అనంతపురం 44. చిత్తూరు 16. ఈస్ట్ గోదావరి 44. గుంటూరు 28. వైఎస్ఆర్ కడప 08. కృష్ణా 18. కర్నూలు 01. నెల్లూరు 08. ప్రకాశం 40. శ్రీకాకుళం 0. విశాఖపట్టణం 34. విజయనగరం 01. వెస్ట్ గోదావరి 38 మందికి కరోనా సోకింది. ఇక దేశం విషయానికి వస్తే.. రోజువారి కేసులు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 13 వేల 166 పాజిటివ్ కేసులు వచ్చాయి. వైరస్ బారిన పడి కొత్తగా 302 మంది చనిపోయారు. కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 13 వేల 226కి చేరింది. 26 వేల 988 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 4 కోట్ల 22 లక్షల 4 వేల 884కి చేరింది. పాజిటివ్ రేటు 1.28గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 34 వేల 235గా ఉంది.

English summary
280 coronacases found at andhra pradesh and 2 people died in last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X