ఏపీలో 528 కరోనా కేసులు.. ఆంక్షలు సడలింపు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. రోజువారీ కేసులు తగ్గడం కాస్త ఊరట కలుగుతుంది. దేశ వ్యాప్తంగా కూడా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో వందల సంఖ్యలో కేసులు రావడంతో ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తోంది. గత 24 గంటల్లో 528 మందికి కరోనా సోకింది. కరోనాతో చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
తూర్పుగోదావరి జిల్లాలో 101, పశ్చిమ గోదావరి జిల్లాలో 92 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. 22 వేల 339 శాంపిల్స్ పరీక్షంచగా 528 మందికి పాజిటివ్ వచ్చింది. గత 24 గంటల్లో 1864 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,29,16,247 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఇక జిల్లాల వారీగా కరోనా కేసులను పరిశీలిస్తే.. అనంతపురం 20. చిత్తూరు 40. ఈస్ట్ గోదావరి 101. గుంటూరు 73. వైఎస్ఆర్ కడప 27. కృష్ణా 57. కర్నూలు 21 నెల్లూరు 21. ప్రకాశం 32. శ్రీకాకుళం 4. విశాఖపట్టణం 31. విజయనగరం 09. వెస్ట్ గోదావరి 92. మొత్తం 528 కేసులు వచ్చాయి.

ఇటు దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది. ఇప్పుడు కేసులు మాత్రం భారీగా తగ్గుతున్నాయి.












Click it and Unblock the Notifications