హమ్మయ్యా.... కరోనా తగ్గుముఖం.. మరణాలు లేవు..
కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. మరణాలు కూడా నమోదు కావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 14 వేల 516 కరోనా పరీక్షలు చేయగా.. 79 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. 167 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో 3,31,81,869 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,18,417 కాగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,02,625గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,729గా ఉంది. రాష్ట్రంలో ఇంకా 1,063 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కరోనా కేసులు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు వెలుగుచూశాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రోజువారీ కేసులు నిన్నటితో పోల్చితే ఇంకాస్త తగ్గి.. ఐదున్నర వేలకు దిగొచ్చాయి. ఇక మరణాలు కూడా భారీగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. గత 24 గంటల్లో 9,09,985 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,476 మందికి పాజిటివ్ గా వచ్చింది. మరో 158 మంది కరోనాతో చనిపోయారు. క్రితం రోజు కరోనా మరణాల సంఖ్య 289గా ఉంది. దేశంలో ఇప్పటివరకూ నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 5,15,036కి చేరింది.
గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉంటుంది. నిన్న 9 వేల 754 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్ జయించిన వారి సంఖ్య 4.23 కోట్లు దాటింది. ఆ రేటు 98.66 శాతానికి పెరిగింది. ఇక యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 59,442కి తగ్గి.. ఆ రేటు 0.14 శాతానికి క్షీణించింది. నిన్న 26,19,778 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 178 కోట్లు దాటింది.
అయితే కాన్పూర్ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు ఫోర్త్ వేవ్ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.
దశలవారీగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి.. కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై పడగవిప్పుతూనే ఉంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి.. జనాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన కలిగిస్తుంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications