అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సలహాల కోసమే, వారు రాజకీయాల కోసం కాదు: నరసాపురంలోకసభ అభ్యర్థిపై పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: పాతిక కేజీల బియ్యంతోనే ఆగిపోకుండా పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తును ఏపీ యువతకు అందించాలన్నదే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి మేధావుల సలహాలు అత్యంత ఆవశ్యమని చెప్పారు. అందుకే జనసేన సలహా మండలిని ఏర్పాటు చేసిందని తెలిపారు.

విలువైన సలహాల కోసమే.. రాజకీయాలకు కాదు

విలువైన సలహాల కోసమే.. రాజకీయాలకు కాదు

విష్ణు విద్యా సంస్థల అధినేత విష్ణురాజు మేథో సంపత్తిని రాష్ట్ర పురోగతికి ఉపయోగించుకోవాలన్న సదాశయంతో ఆయనకు ఈ మండలి చైర్మన్ బాధ్యతలు అప్పగించామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కూడా విశాల దృక్పథంతో ఈ బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. అలాగే దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఇరవై ఏళ్ల పాటు సలహాదారుగా పని చేసిన పొన్నురాజ్, రిటైర్డ్ ప్రొఫెసర్ సుధాకర రావు వంటి మేధావులు ఈ మండలిలో సభ్యులు అన్నారు. వీరు ఎవరు కూడా రాజకీయ పదవులు ఆశించి పని చేయడం లేదన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి జనసేనకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు.

నరసాపురం లోకసభ స్థానానికి ఎవరిని నిలబెట్టాలో..

నరసాపురం లోకసభ స్థానానికి ఎవరిని నిలబెట్టాలో..

అలాగే, నరసాపురం లోకసభ అభ్యర్థిపై పార్టీ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఎవరూ అనవసర ప్రచారాలు చేయవద్దని హితవు పలికారు. నరసాపురం నుంచి విష్ణు పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో జనసేనాని స్పందించారు. విలువైన సూచనల కోసమే పార్టీ సలహా మండలిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విష్ణురాజు, పొన్నురాజు, సుధాకర్ వంటి సభ్యులు ఉన్న సలహా మండలి పార్టీ ఉన్నతికి దోహద పడుతుందని వ్యాఖ్యానించారు. వారు ఎవరు కూడా పదవులు ఆశించి సలహా మండలి సభ్యులుగా పార్టీలో చేరలేదని చెప్పారు.

వాసవీ మాత విగ్రహ ప్రతిష్టాపనలో పవన్ కళ్యాణ్

వాసవీ మాత విగ్రహ ప్రతిష్టాపనలో పవన్ కళ్యాణ్


ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (గురువారం) పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో పర్యటించనున్నారు. వాసవీమాత పంచలోహ విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొననున్నారు. వాసవిధామ్‌లో 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొంటారు. ఉదయం పదకొండు గంటకు విజయవాడ నుంచి హెలికాఫ్టర్‌లో పెనుగొండ వెళ్లి, అక్కడి మార్కెట్ యార్డ్ నుంచి రోడ్డు మార్గంలో వాసవిధామ్ ఆలయానికి చేరుకుంటారు.

English summary
Jana Sena chief Pawan Kalyan said that advisory council is not for politics. He said his aim is to ensure golden future for 25 long years to the youth of Andhra Pradesh without conflicting to the 25 kg rice scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X