Rainfall Alert:ఏపీలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలో ఎఫెక్ట్

ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కొస్తాలోని ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలులో అక్కడక్కడా భారీ వర్షాలు కురియనున్నాయని పేర్కొన్నారు.

కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో రాగల రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా ఈనెల 26న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రం లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో రాగల రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ap Weather News: Rain Alert In andhra pradesh

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

    రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నెల 26 నాటికి ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అధిక పీడనం వల్ల సముద్రం నుంచి రాష్ట్రం వైపు తేమ వస్తోంది. దాంతో అనంతపురం చిత్తూరు తో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం కూడా జరిగింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+