అమరావతిలో కేంద్రం కీలక నిర్ణయం - తాజాగా..!!

ఏపీ రాజధాని విషయంలో న్యాయ- రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఇదే సమయంలో అమరావతిలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్ల నడుమ ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇదే సమయంలో కేంద్రం తాజాగా అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తక్షణ నిధులను మంజూరు చేసింది. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది.

రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన వివాదం కొనసాగుతోంది. మూడు రాజధానుల్లో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ స్థానిక రైతులు, జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ కు వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది. ఇదే సమయంలో అమరావతిలో కేంద్ర నిర్మాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

Central Funds allocation for constructions in Amaravati and Vizag amid Three Capital row

అమరావతిలో నిర్మించతలపెట్టిన కేంద్రీయ సచివాలయం అంచనా వ్యయాన్ని రూ.1,500 కోట్లకు పెంచింది. తక్షణమే రూ. కోటి కేటాయించింది. గతేడాది ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,244.19 కోట్లుగా ఉంది. 2023-24 బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులను ఆయా అవసరాల కోసం కేటాయిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమగ్ర పద్దుల వివరాలను విడుదల చేసింది.

అమరావతి పరిధిలోని రాయపూడిలో కేంద్రీయ సచివాలయం భవన నిర్మాణానికి ప్రత్యేక హెడ్‌ను సృష్టించింది. రూ.1,500 కోట్ల అంచనా వ్య యంతో నిర్మిస్తున్న ఈ భవనానికి 2023-24లో రూ.కోటి కేటాయిస్తున్నట్లు పేర్కొంది. దీంతో పాటుగా విశాఖ కేంద్రంగా సాగుతున్న నిర్మాణాలకు కేంద్రం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

రూ.46.76 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ డాబాగార్డెన్స్‌లో ఆదాయపు పన్ను శాఖ నూతన భవన నిర్మాణానికి, రూ.18.17 కోట్ల వ్యయంతో విశాఖలో కేంద్ర జీఎస్టీ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూ. కోటి చొప్పున, విశాఖలో రూ.10 కోట్ల వ్యయంతో జనరల్‌ పూల్‌ ఆఫీస్‌ అకామడేషన్‌ (జీపీఏవో) నిర్మాణానికి రూ.50 లక్షలు, అందుకు రూ.5 కోట్లతో భూమి కొనుగోలుకు రూ.లక్ష కేటాయించింది. ఇప్పటికే ఏపీ రాజధాని వివాదానికి సంబంధించి సుప్రీం సూచనల మేరకు కేంద్రం తన వాదనలతో అఫిడవిట్ దాఖలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+