ప్రతీ స్కాం స్కామే.. జగన్‌పై చంద్రబాబు విసుర్లు
వైఎస్ జగన్ హయాంలో ప్రతి స్కీం స్కాంగా మారిపోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. దొంగ లెక్కలు రాయడంలో ఏ1, ఏ2 సిద్ధహస్తులుగా మారారని, ప్రశ్నిస్తే సమాధానం చెప్పకపోగా, ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. మహానాడు ముగింపు సమావేశం సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు.

గతంలో సంక్షేమం అభివృద్ధి సమంగా సాగేవని, టూంబ్ టూ ఊంబ్ స్కీంలు అమలు చేశామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం, సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, సంక్షేమ పథకాలపై ప్రపజల్లో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. వైసీపీ ఓ ఫేక్ పార్టీ అని, జగన్ ఫేక్ ముఖ్యమంత్రి అని విరుచుకుపడ్డారు. అందరికీ వ్యాక్సిన్ అందించాలని, వ్యాక్సిన్ విషయంలో కులాల ప్రస్తావన ఏమాత్రం సముచితం కాదన్నారు.
సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇచ్చింది గోరంత, దోచుకుంది కొండంత అని మండిపడ్డారు. కరోనా కట్టడిలో సర్కారుకు సహకరిస్తామని తాము ముందుగానే ప్రకటించామని గుర్తు చేశారు. అమరావతిని జగన్ సర్కార్ సర్వనాశనం చేసిందని, ప్రత్యేక హోదాపై కనీసం మాట్లాడటం లేదని చంద్రబాబు మండిపడ్డారు. హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందని చెప్పారని, 25 ఎంపీలను ఇస్తే హోదా సాధిస్తామని అన్నారని, ప్రత్యేక హోదాను ఎప్పుడు సాధిస్తారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications