• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆనందయ్య నాటుమందుపై రాజకీయాలు, నిలిపివేయాలని చెప్పడం ఏంటీ: చంద్రబాబు

|

ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేసోంని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆయుర్వేద మందుపై ప్రభుత్వం అధ్యయనం చేయాలి, కానీ.. అధ్యయనం చేయకుండా తక్షణమే నిలిపివేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. వైసీపీ ఎమ్మెల్యే పిలుపుతో కృష్ణపట్నంలో ప్రజలు గుమిగూడారని చంద్రబాబు అన్నారు. ఏపీలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఆక్సిజన్ అందక..

ఆక్సిజన్ అందక..


ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన సీఎం జగన్ కక్షసాధింపులకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే ఎదురు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

కోర్టుల్లో ఎదురుదెబ్బలు

కోర్టుల్లో ఎదురుదెబ్బలు


రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన అన్ని అంశాలపై కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయని అన్నారు. కొత్త ఎస్ఈసీని తీసుకువచ్చి ఆగమేఘాల మీద పోలింగ్ నిర్వహించారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకుండా పరిషత్ ఎన్నికలను జరిపారన్నారు. నామినేషన్లు సరిగా ఉన్నవాళ్లవి కూడా తిరిస్కరించారని చంద్రబాబు దుయ్యబట్టారు. సీఎం జగన్ అహంభావంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు.

రాజారెడ్డి రాజ్యం కాదు..?

రాజారెడ్డి రాజ్యం కాదు..?

కోర్టుల ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. మీ ఇష్టమొచ్చినట్లు చేసేందుకైన రాజ్యాంగం ఉన్నది అని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం కాదు.. అంబేద్కర్ రాజ్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం కేసు పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు రావా? అని ప్రశ్నించారు. ఎంపీ రఘురామను హింసించడం బాధాకరమన్నారు. రఘురామను పోలీసులు వేధించారని సుప్రీంకోర్టులో తేలిందని చంద్రబాబు అన్నారు.

  New Coronavirus Found In Malaysia That Can Transfer From Dogs To Humans || Oneindia Telugu
  ల్యాబ్‌కు శాంపిల్స్

  ల్యాబ్‌కు శాంపిల్స్

  రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స కూడా కష్టతరంగా మారింది. ఆక్సిజన్‌ అందక చాలామంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ‘కృష్ణపట్నం ఆయుర్వేద మందు' కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం ఆయుష్‌ ల్యాబ్‌కు పంపింది. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

  English summary
  chandrababu slams ys jagan government on anandaiah nattuvaidyam issue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X