అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదేంది జగన్.. జనం అల్లాడుతుంటే.. పెళ్లికి వెళ్లావా.. లోకేశ్ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు ఏపీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు సీఎంల భేటీ గురించి కాదు.. ఏపీలో వరద విలయ తాండవం చేస్తోన్న వేళ.. కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని నారా లోకేశ్ కూడా ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏంటీ సీఎం అంటూ విరుచుకుపడ్డారు.

పోచారం మనమరాలి వివాహా వేడుకలో సీఎంలు జగన్, కేసీఆర్ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఏపీలో వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ పెళ్లికి హాజరుకావడంపై టీడీపీ నేత లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే సీఎం జగన్ పెళ్లికి హాజరుఉ కావడమేంటని లోకేష్ ప్రశ్నించారు. దీనిని నమ్మలేకపోతున్నా.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వరదలకు అతలాకుతలమై, ఎంతో మంది ప్రాణాలు పోతుంటే మన ముఖ్యమంత్రి వాళ్లను ఆదుకునేది పోయి.. పెళ్లిళ్లకు వెళ్తున్నారు. రాయలసీమను కాపాడాలని లోకేష్ ట్వీట్ చేశారు.

cm jagan attended the marriage, nara lokesh shocked

జగన్, కేసీఆర్ వధూవరులతో దిగిన ఫోటోను కూడా లోకేష్ షేర్ చేశారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత మంగళవారం నుంచి పర్యటించనున్నారు. ఇప్పటికే వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నారా లోకేశ్ తనదైన శైలిలో విమర్శలు చేశారు.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గత వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల వల్ల తిరుమల కొండచరియలు విరిగి ఘాట్‌ రోడ్డుపై పడిపోయాయి. మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. తిరుమల కొండలపైనుంచి వస్తున్న వాన నీటితో కపిలతీర్ధంలో మండపం కూలిపోయింది. తిరుమల జలదిగ్బందంలో చిక్కుకొనిపోయింది.

English summary
ap cm jagan mohan reddy attended telangana speaker pocharam srinivas reddy grand daughter marriage. tdp leader nara lokesh shocked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X