సీఎం జగన్ సీరియస్... వాళ్లకు భారీ మూల్యం తప్పదు... కలెక్టర్లకు ఆదేశాలు...

రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా చికిత్సల కోసం భారీ ఫీజులు వసూలు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్‌ అయ్యారు. భారీ ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులకు భారీ మూల్యం తప్పదన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని... ఈ మేరకు కలెక్టర్ల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. మంగళవారం(అగస్టు 25) కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అంశాలపై జగన్ చర్చించారు.

మానవత్వంతో వ్యవహరించండి...

మానవత్వంతో వ్యవహరించండి...

కరోనా సోకిన పేషెంట్ ఆస్పత్రికి వచ్చిన అరగంటలోపు బెడ్ కేటాయించాలని.... దీనికి కలెక్టర్లదే బాధ్యత అని సీఎం జగన్ మరోసారి గుర్తుచేశారు. కరోనా పేషెంట్ల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. కరోనా సంబంధిత వివరాల కోసం 104, 14410 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసేవారికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని,వారికి భరోసా కల్పించాలని చెప్పారు. కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం,మొక్కుబడిగా సమాధానాలివ్వడం చేయకూడదన్నారు.

వరదలపై సమీక్ష...

వరదలపై సమీక్ష...

ఇదే వీడియో కాన్ఫరెన్స్‌లో ఇటీవలి భారీ వర్షాలు,వరదలపై కూడా సీఎం సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై కలెక్టర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దావరి, కృష్ణా నదిలో వరదలు తగ్గుముఖం పట్టాయని.... సెప్టెంబర్ 7 లోగా పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని బాధితులకు రూ.2వేల ఆర్థిక సాయం అందించేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.

ముంపు బాధితులకు అదనపు రేషన్..

ముంపు బాధితులకు అదనపు రేషన్..

ముంపు బాధితులకు ప్రతీ నెలా అందించే రేషన్‌కు అదనంగా మరో 25 కిలోల బియ్యం,కిలో కందిపప్పు,కిలో పామాయిల్,కిలో ఉల్లి,కిలో బంగాళదుంపలు,2లీటర్ల కిరోసిన్ తదితర వస్తువులు అందించాలన్నారు. సెప్టెంబర్ 7లోగా ముంపు బాధితులందరికీ రేషన్ సరుకులు చేరాలని ఆదేశించారు. సాగునీటి రంగానికి ఆటంకం కలిగిన చోట్ల వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని అన్నారు. అలాగే వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని...

ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని...

ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని సీఎం జగన్ అన్నారు. పారిశుద్ధ్యం,తాగునీటికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంపు బాధితులకు అందించే నిత్యావసరాలను మండల స్థాయిలోనే నిల్వ చేసుకుని... ఎప్పటికప్పుడు సప్లై చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+