అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కౌంట్ డౌన్ స్టార్ట్‌: మార్చి లో షెడ్యూల్‌: తొలి విడ‌త‌లోనే ఏపి ఎన్నిక‌లు..పార్టీల వ్యూహాలు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Election 2019 : Count Down Start For 2019 Elections In AP | Oneindia Telugu

కౌంట్ డౌన్ మొద‌లైంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల న‌గారాకు దాదాపు మూహుర్తం ఖ‌రారైంది. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం లేదా మార్చి మొద‌టి వారంలో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఏపికి సంబంధించి తొలి విడ‌త‌లోనే ఎన్నిక‌లు జరిగే అవకాశం ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో..ఏపిలోని రాజ‌కీయ పార్టీల అధినేతలు పూర్తిగా ఎన్నిక‌ల వ్య‌వ‌హారాల మీదే దృష్టి కేంద్రీక‌రించారు.

షెడ్యూల్ విడుద‌ల‌తో..

షెడ్యూల్ విడుద‌ల‌తో..

ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం లేదా మార్చి మొద‌టి వారంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఏపి అసెంబ్లీకి జూన 18న గ‌డువు ముగియ‌నుంది. అయితే, ఈ సారి లోక్‌స‌భ ఎన్నిక‌ల తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికలు కూడా జరిపే అవ‌కాశం ఉంది. 2014లో 9 దశల్లో ఎన్నికలు జరిగాయి. మార్చి 5న ప్రకటన వెలువడింది. తొలిదశ ఏప్రిల్‌ 7న, చివరి దశ పోలింగ్‌ మే 12న జరిగాయి. రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా 2014 లో తెలంగాణ లో ఏప్రిల్‌ 30, ఏపి లో ఏప్రిల్ 7న ఎన్నిక‌లు జరిగాయి. కాగా, మే 16న ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి.

ఏపి లో అసెంబ్లీకి ఎన్నిక‌లు

ఏపి లో అసెంబ్లీకి ఎన్నిక‌లు

ఈ సారి ఏపి లో లోక్‌స‌భ తో పాటుగా అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రగాల్సి ఉండ‌టంతో.. ఏపి లో తొలి విడ‌త లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈశాన్య రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు భద్ర‌తా సిబ్బంది ఎక్కువ‌గా వినియో గించాల్సిన అవ‌స‌రం ఉండటంతో పాటుగా ఒకే విడ‌త లో అక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హించే వీలు ఉండ‌ద‌ని చెబుతున్నా రు. దీంతో..తొలి విడ‌త‌లోనే ఏపిలో ఎన్నిక‌లు ముగించటం ద్వారా ఇక్క‌డి బ‌ల‌గాలు ఆ ప్రాంతాల‌కు త‌ర‌లించే వీలు ఉంటుంద‌ని చెబుతున్నారు.

అధికార - ప్ర‌తిప‌క్ష వ్యూహాలు ఇవేనా..

అధికార - ప్ర‌తిప‌క్ష వ్యూహాలు ఇవేనా..

ఏపిలో మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల‌తో పాటుగా 175 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఈ మేర‌కు మార్చి తొలి వారంలో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది. అ స‌మాచారంతో ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టికే ఎన్నిక ల కార్యాచ‌ర‌ణ ప్రారంభించాయి. ఇందులో భాగంగా.. ఎన్నిక‌ల వ‌రాలు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇక‌, ఏపి ప్ర‌భుత్వం ఈ నెల 21 జ‌రిగే క్యాబినెట్ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది. అదే విధంగా..ఈ నెల 30న ఓట్ ఆన్ ఎకౌంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్ర‌వ‌రి 5న ప్ర‌వేశ పెట్టే ఓట్ ఆన్ ఎకౌంట్ బ‌డ్జెట్ లో కీల‌క ప్ర‌క‌ట‌న‌లు ఉండే అవ‌కాశం ఉంది. ఏపి ప్ర‌భుత్వం విప‌క్ష నేత‌ల హామీలకు పోటీగా పెన్ష‌న్ల పెంపు..ఉచిత విద్యుత్ ఏడు గంట‌ల నుండి తొమ్మ‌ది గంట‌ల‌కు పెంపు వంటి నిర్ణ‌యాలు అమ‌లు చేస్తోంది. ఇక‌, వైసిపి త‌మ హామీల‌ను టిడిపి కాపీ చేస్తుం ద‌ని ప్ర‌చారం చేస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా మేనిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు వైసిపి స‌మాయత్తం అవుతోంది. ఇక‌, జ‌న‌సేన పార్టీ పార్ల‌మెంరీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభ్య‌ర్ద‌లు క‌స‌ర‌త్తు చేస్తోంఇ. ఇప్ప‌టి నుండి ప్ర‌తీ రోజు కీల‌కం కావ‌టంతో..ఏపి లో ని పార్టీలు కౌంట్ డౌన్ ప్ర‌క‌టించాయి.

English summary
Count down start for 2019 elections. Election Schedule may be released in next month and elections in April. Source said AP elections may take in First Phase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X