బాబు పాలన మీద విరక్తి పుట్టింది : గెలిచేది జగనే : వైసిపి లో చేరిన జై రమేష్..!
వైసిపి లో మరో టిడిపి ముఖ్యుడు చేరారు. తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడిగా వ్యవహరించిన దాసరి జై రమేష్ లోటస్ పాండ్ లో జగన్ ను కలిసారు. ఏపిలో చంద్రబాబు పాలన పై విరక్తి పుట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండేళ్ల లోనే ఒక్కో ఎమ్మెల్యే 50 కోట్ల నుండి 200 కోట్ల వరకు సంపాదించారని పేర్కొన్నారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తానని స్పష్టం చేసారు.

జగన్ తో జై రమేష్ సమావేశం..
వైసిపి అధినేత జగన్ తో టిడిపి మాజీ నేత దాసరి జై రమేష్ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. టిడిపి వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న జై రమేష్ టిడిపి నుండి 1998 లో విజయవాడ నుండి ఎంపి అభ్యర్దిగా పోటీ చేసారు. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు సమయంలోనూ చంద్రబాబుకు మద్దతుగా వ్యవహరించారు. దగ్గుబా టి తో సన్నిహితంగా ఉండే జై రమేష్ వైసిపి లో చేరాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ అంటే అభిమానం గా ఉండే జై రమేష్ హైదరాబాద్ ఆబిడ్స్ లో ఉన్న ఎన్టీఆర్ నివాసం బయటి వారికి దక్కకుండా తానే ఉంచుకోవాలనే ఉద్దేశం తో ఆయనే కొనుగోలు చేసారు. అయితే, పార్టీలో చంద్రబాబు వ్యవహార శైలి నచ్చక ఆయన టిడిపికి దూరంగా ఉంటున్నా రు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుండి వైసిపి అభ్యర్ది బరిలో దిగేందుకు జై రమేష్ ను దగ్గుబాటి ఒప్పించారు. జగన్ తో కలిసేందుకు జై రమేష్ తో పాటుగా ఆయన వెంట దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కూడా ఉన్నారు.
తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడు దాసరి జైరమేష్ లోటస్ పాండ్ లో వైయస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు#YSRCP #YSJagan pic.twitter.com/aAnY6bh4JE
— YSR Congress Party (@YSRCParty) February 15, 2019
ఈ స్థాయి అవినీతి ఎప్పుడూ జరగలేదు..
వైసిపి లో చేరిన జై రమేష్ చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ స్థాయి లో అవినీతి గతంలో ఎప్పు డూ జరగలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటానికి గతంలో తాను సహకరించానని చెప్పుకొచ్చా రు. అమరావతి నిర్మాణం ఓ కల గా మిగిలిపోయిందన్న జై రమేష్..చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది మరొకటిగా మారిందని విమర్శించారు. ఎన్టీఆర్ పై నాదెండ్ల వెన్నుపోటు సమయంలో రామకృష్ణ సినీ స్టూడియో లోనే ఉండి తాను ఎన్టీఆర్ కోసం పని చేసానని గుర్తు చేసారు. తాను ఇప్పుడు టిడిపికి పూర్తిగా దూరంగా ఉన్నానని..ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరటం లేదని ఆరోపించారు. విజయవాడ నుండి ఎంపీగా పోటీ చేయటానికి తాను సిద్దమేనని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications