దివ్య వాణి చూపు ఎటు వైపు.. భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ
టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి హల్ చల్ చేస్తున్నారు. ఆమె ఏ పార్టీలో చేరతారనే అంశంపై స్పష్టత రాలేదు. ఆమె చేరే పార్టీపై ఉత్కంఠ నెలకొంది. త్వరలో భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. తదుపరి కార్యాచరణను మీడియా ద్వారానే వెల్లడిస్తానని దివ్యవాణి ప్రకటించారు.
టీడీపీకి రాజీనామా చేస్తున్నానని మొన్న ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల ఆర్జునుడితో మాట్లాడిన అనంతరం ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఆ మరునాడు టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. టీడీపీని వీడిన దివ్యవాణి త్వరలోనే వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

దివ్య వాణి ఎట్టకేలకు టీడీపీకి రాజీనామా చేశారు. అయితే నెక్ట్స్ స్టెప్ ఏంటీ అనే చర్చ జరుగుతుంది. వైసీపీ వైపు వెళ్లే అవకాశాలు తక్కువే.. ఆమె బీజేపీ వైపు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ పెద్దలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లేదంటూ.. దివ్యవాణి ఇవాళే టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని దివ్యవాణి రాజీనామాస్త్రం సంధించారు. ఆ వెంటనే వెనక్కి తీసుకున్నారు. కానీ మరోసారి రిజైన్ చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడారు. దీంతో రాజీనామాపై దివ్యవాణి వెనక్కి తగ్గారు. కానీ ఫలితం లేదు. టీడీపీలో గుర్తింపు దక్కడం లేదని పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు అదే విషయం తెలియజేశారు.












Click it and Unblock the Notifications