ఉద్యోగులు గృహ నిర్బంధాలా..? జగన్ సర్కార్‌పై చంద్రబాబు పైర్
పీఆర్సీ కోసం ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తతకు దారితీసింది. వారిని ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. దీనిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఖండించారు. చలో విజయవాడ కోసం ఉద్యోగుల నిరసన చేపడితే.. జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరు సరికాదన్నారు.ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆలోచనతో స్పందించాలి..
వైసిపి సర్కార్ రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా...ఆలోచనతో స్పందించాలని కోరారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా? అని అడిగారు. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా...రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని అడిగారు.

ఉద్యోగులపై కూడానా..
రాజకీయ పక్షాలపై పెట్టినట్లు ఉద్యోగులపై గృహ నిర్భంధాలు సిఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం... విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేనని చెప్పారు. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ....ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

ఆత్మగౌరవం దెబ్బతీసేలా..
ఉద్యోగులను అగౌరపరిచే... ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. జగన్ సర్కార్ మాదిరిగా .ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదన్నారు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి....ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Recommended Video

ఉద్యోగుల ఝలక్
ఇటు మరోవైపు ఏపీ జేఏసీకి ఆర్టీసీ ఉద్యోగులు ఝలక్ ఇచ్చారు. తాము సమ్మెలో పాల్గొనడం లేదని చెప్పారు. సమ్మెలో పాల్గొనేది లేదని ఆర్టీసీ ఉద్యోగులు తేల్చి చెప్పారు. సమ్మెలో పాల్గొనడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆర్టీసీ సంక్షేమ సంఘాల నేతలు నిన్న లేఖ అందించారు. ఉద్యోగుల డిమాండ్లలో తమకు సంబంధించినవి లేవన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగే కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు.సమ్మెకు వెళ్లేదిలేదంటూ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘాలు నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో పాల్గొనబోమని చెప్పారు. ఉద్యోగులతోపాటు సమ్మెకు వెళ్లేంది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 వేల మందికిపైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులం సమ్మెలో పాల్గొనడం లేదని ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత శాస్త్రి చెప్పారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications