అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందుబాబుల జేబులకు చిల్లు, నకిలీ ఎమ్మార్పీలతో మోసం.. మద్యం షాపుల్లో నయాదందా

|
Google Oneindia TeluguNews

మందుబాబుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. మద్యం ధరలతో బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో వారి జేబులకు చిల్లు పడుతోంది. అయితే ఈ దోపిడీ గురించి వారికి తెలియకపోవడం విశేషం. తెలిసిన వారు ప్రశ్నించిన అంతే.. తింగర సమాధానం వస్తోంది. ఏపీలో ప్రభుత్వ మద్యం షాపుల్లో నయా దందాకు తెరలేచింది. మొదటి నుంచి బ్రాండెడ్ మద్యం బార్లకు, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తు సిబ్బంది సొమ్ముచేసుకున్నారు.

 ఆదాయం చాలడం లేదా..?

ఆదాయం చాలడం లేదా..?

అలా వస్తున్న ఆదాయం చాలడం లేదో ఏమో.. నకిలీ ఎమ్మార్పీలను స్టార్ట్ చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న చీప్ లిక్కర్ బాటిళ్లపై సొంత ఎమ్మార్పీ స్టిక్కర్లు అంటిస్తూ వస్తున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో వెలుగుచూసిన ఘటన ఇందుకు సజీవసాక్ష్యంగా నిలుస్తోంది. నందివాడ మండలం తమిరశ గ్రామంలో మద్యం షాపుల్లో కొత్త ఎమ్మార్పీ రేట్లపై లిక్కర్ సేల్ చేస్తున్నారు. దీనిపై వినియోగదారులు ప్రశ్నించినా.. రేట్లు పెరిగాయని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

రూ.40 తేడా

రూ.40 తేడా


ఇటీవల ఓ వ్యక్తి ధర తేడాను గమనించారు. ఇతర చోటకు తమిరశ షాపులో రూ.40 తేడా ఉంది. దీనిపై నిలదీయగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో అతను ఈ విషయం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గుడివాడ నుంచి వచ్చిన ఎక్సైజ్ అధికారులు దాడుల చేయగా.. 9 వేల ఎమ్మార్పీ స్టిక్కర్లు లభించాయి. దీంతో ఆరుగురు వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే నకిలీ ఎమ్మార్పీ అంశం చాలాకాలంగా జరుగుతుందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు.

 వారికి కాసుల వర్షం..

వారికి కాసుల వర్షం..

కొత్త లిక్కర్ పాలసీ ఎక్సైజ్ అధికారులు, మద్యం షాపులు నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తోన్న క్రమంలోనే మద్యం పాలసీ తీసుకొచ్చి.. పలు మార్పులు కూడా చేసింది. ప్రైవేటు నిర్వహణలో గల షాపులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి.. ఏటా షాపుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. ఇదివరకు రాష్ట్రలో 4383 షాపులు ఉండగా.. ఇప్పుడు అవీ 2900కి తగ్గించారు. పలు చోట్ల షాపులు తగ్గడం, బార్లలో ధరలు ఎక్కువ ధరలు ఉండటంతో.. ప్రభుత్వ మద్యం షాపులపైనే ఆధారపడుతున్నారు. దానిని సిబ్బంది క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్కో షాపు రోజుకు రూ.12 వేల వరకు ఆన్ ఆఫీషియల్‌గా సంపాదించుకుంటుందని తెలుస్తోంది.

తొలి నుంచి ఇంతే..?

తొలి నుంచి ఇంతే..?

ఇప్పుడే కాదు ప్రభుత్వ మద్యం షాపుల్లో తొలి నుంచి అవకతవకలు జరుగుతున్నాయి. మొదట్లో షాపుకు వచ్చి బ్రాండెడ్ లిక్కర్ బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ముచేసుకునే వారు. ఇప్పుడు బార్లకు తరలిస్తూ క్యాష్ చేస్తున్నారు. బార్లలో బ్రాండెడ్ మద్యం సరఫరాపై ఆంక్షలు, రేట్ల పెంపు వల్ల ప్రభుత్వ మద్యం షాపుల్లో నుంచి భారీగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారుల సాయంతో మద్యం షాపు సిబ్బంది బ్లాక్ మార్కెట్ దందాను నిర్వహిస్తున్నారు. లోకల్ ఎక్సైజ్ సిబ్బంది సాయంతో మద్యం షాపు సిబ్బంది బ్లాక్ మార్కెట్ దందాను నిర్వహిస్తున్నారు. దీనికి తగ్గట్టూ ప్రభుత్వ మద్యం షాపుల్లో బ్రాండెడ్ మద్యం అమ్మడం లేదనే విమర్శలు తొలి నుంచి వస్తున్నాయి. దీనికి తగ్గట్టూ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.

కనిపించని బోర్డులు

కనిపించని బోర్డులు

రాష్ట్రంలో గల ప్రభుత్వ మద్యం షాపుల వద్ద ఎమ్మార్పీ బోర్డులు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. అందరికీ కనిపించేలా బోర్డులు ఉండాలని స్పష్టంచేశారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల బోర్డు ఉన్న వినియోగదారులకు మాత్రం కనిపించడం లేదు. మరికొన్ని చోట్ల అయితే చూసినా సరే ఆగుపడటం లేదు. ఇంత జరుగుతున్నా.. ఎక్సైజ్ సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది. ఇదివరకటిలా నాటుసారా, గంజాయి, డ్రగ్స్‌లపై దాడులు చేసే పని ఎక్సైజ్ శాఖకు లేదు.

విభజించినా.. అంతే

విభజించినా.. అంతే

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి అమ్మకాల పర్యవేక్షణకు పరిమితం చేసింది. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల షాపులను ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో ఎస్సై, సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ షాపులో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లలో ఒకరు విధులు నిర్వహిస్తారు. అయితే ఇందులో అందరికీ వాటా ఉన్నందున ఇలాంటి చర్యలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయని చెప్పొచ్చు.

English summary
fake mrps in andhra pradesh government liquor shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X