అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీరు ప్రియుల‌కు శుభ‌వార్త‌..! అతి చౌక‌గా బీరును అందుబాటులోకి తెచ్చిన ఏపీ స‌ర్కార్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Andhra Pradesh Makes Cheap Liquor Cheaper | Oneindia Telugu

అమరావతి/ హైద‌రాబాద్ : బీరు ప్రియుల‌కు శుభ‌వార్త అందిస్తోంది ఏపి ప్ర‌భుత్వం. ఎండా కాలం స‌మీపిస్తున్న త‌రుణంలో ఉద‌యం అంతా ప‌ని చేసి సాయంత్రం కాగానే నోట్లో కాస్తా బీరు పోసుకుందాం అనుకునే వాళ్ల‌కు తీయ‌టి క‌బురు చెప్పింది ఏపి స‌ర్కార్. మందుబాబులకు జోష్‌నిచ్చేలా, రాష్ట్రంలో చీప్‌ లిక్కర్‌ తరహాలో చీప్‌ బీర్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత ధరలతో పోలిస్తే దాదాపు 30 నుంచి 40 రూపాయ‌లు తక్కువకే కొత్త బ్రాండ్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు.

సోమవారం నుంచి ఈ బ్రాండ్‌ షాపుల్లోకి వచ్చేసింది. బీర్లలో స్ట్రాంగ్‌, లైట్‌ అని రెండు రకాలుంటాయి. ప్రస్తుతం స్ట్రాంగ్‌ బీరు 130 రూపాయ‌ల వరకు, లైట్‌ బీరు 110రూపాయ‌ల వరకూ ఉంది. కొన్ని బ్రాండ్లు లైట్‌ బీరును 100రూపాయ‌ల‌కే విక్రయిస్తున్నాయి. కాగా నెల్లూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక బ్రేవరీ 650 ఎంఎల్‌ సీసా లైట్‌ బీర్‌ను కేవలం 70రూపాయ‌ల ఎమ్మార్పీతో మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Good news for beer lovers..! AP Sarkar made the cheapest beer available..!!

5 శాతం ఆల్కాహాల్‌తో ఈ బ్రాండ్‌ను తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో విక్రయించే మద్యంలో.. లిక్కర్‌లో 42శాతం, బీరులో 5 నుంచి 7శాతం ఆల్కాహాల్‌ ఉంటుంది. అయితే ఈ పరిణామం మద్యం విక్రయాలపై ప్రభావం చూపే అవకాశముందని ఎక్సైజ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ రకాల పన్నులతో మద్యం ధరలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి.

దీంతో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం కూడా సాహసం చేయడం లేదు. సుదీర్ఘకాలం తర్వాత గతేడాది జరిగిన ధరల సవరణలో కూడా చీప్‌ లిక్కర్‌కు మినహాయింపునిచ్చింది. దీంతో చీప్‌ లిక్కర్‌ విక్రయాలు ఏడాదిలో 43శాతం పెరిగాయి. ఈ తరుణంలో బీరు కూడా తక్కువ ధరకు మార్కెట్‌లోకి రావడంతో విక్రయాలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ బీరు ధ‌ర బీరు ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ర్శించే అవ‌కాశం ఉంద‌ని, వ‌చ్చే వేస‌విలో వీటి వినియోగం కూడా ఎక్కువాగా ఉండిచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు ఎక్సైజ్ అదికారులు.

English summary
Cheap beer is available in the AP state as cheap liqueur. About rs 30 to rs 40 new ones were introduced in the market compared to current prices. The brand has arrived in the shops since Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X