అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయ‌న అంత ఫెయిర్ కాదు..! ఐనా జ‌న‌సేన‌లో ఆయ‌న నియామకానికి ఓ లెక్కుందంటున్న ప‌వ‌న్..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ స‌ల‌హాదురుడుగా ఆయ‌న నియామ‌కం ప‌ట్ల పార్టీ లో రోజురోజుకూ వ్య‌తిరేక‌త పెరిగిపోంతోంది. రాజ‌కీయాల్లో స‌మూల మార్పులు తీసుకొస్తా, అవినీతిని అంత‌మొందిస్తాన‌ని చెప్పుకొచ్చే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలాంటి వ్య‌క్తిని రాజ‌కీయ స‌ల‌హాదారుడుగా నియ‌మించుకున్నారేంట‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చురుకైన పాత్ర పోషించి, ఆత‌ర్వాత టీటీడి బోర్డ్ మెంబ‌ర్ అక్ర‌మ సంపాద‌న‌లో భాగ‌స్వామ్యం ఉంద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఆ వివాదాస్ప‌ద వ్య‌క్తిని త‌న అనుంగు అనుచ‌రుడిగా ప‌వ‌న్ ఎలా నియ‌మించుకుంటార‌ని పార్టీ శ్రేణులు త‌మ‌లో తాము ప్ర‌శ్నించుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఎవ‌రు ఏమ‌నుకున్నా రాజ‌కీయ స‌ల‌హాదారుడుగా ఆయ‌న నియామ‌కానికి ఓ లెక్కుందంటున్నారు గ‌బ్బ‌ర్ సింగ్..!!

పవ‌న్ ప్ర‌తి పనికి ఓ లెక్కుంటుంది..! అలాగే పార్టీలో ప్ర‌తి నియామ‌కానికి ఓ కిక్కింటుంది..!!

పవ‌న్ ప్ర‌తి పనికి ఓ లెక్కుంటుంది..! అలాగే పార్టీలో ప్ర‌తి నియామ‌కానికి ఓ కిక్కింటుంది..!!

రాజ‌కీయాల్లో క్రియాశీల మార్పులు తెస్తాన‌ని, అవినీత రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని పార్టీని ఏర్పాటు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సమ సమాజ స్థాపన, కుల వివక్ష, అవినీతి రహిత సమాజం ఇలా పలు సిద్దాంతాలతో పార్టీని స్థాపించినట్లు ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అవినీతిపరులకు కొమ్ము కాసే వారిని ఓడించాలని, అలాంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలను ప్రోత్సహించవద్దని ఎన్నో బహిరంగ సభల్లో పేర్కొన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లోని చాలా మంది విద్యావంతులు, ప్రజల్లో మంచి పేరు ఉన్న ఇతర పార్టీల నాయకులు జనసేన వైపు మొగ్గు చూపారు.

పార్టీలో ప్ర‌వాహంలా చేరిక‌లు..! క్షుణ్నంగా ప‌రిశీలించ‌లేకపోతున్న జ‌న‌సేనాని..!!

పార్టీలో ప్ర‌వాహంలా చేరిక‌లు..! క్షుణ్నంగా ప‌రిశీలించ‌లేకపోతున్న జ‌న‌సేనాని..!!

అయితే, ఎన్నికలకు సన్నద్ధమయ్యే క్రమంలో గ‌బ్బ‌ర్ సింగ్, తమ పార్టీలోకి వచ్చే వారి గత చరిత్రను పరిగణలోనికి తీసుకోవడంలేదు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులుగా పేర్కొన్న, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పలువురుని జనసేనలోకి తీసుకున్నారు. తాజాగా అదే కోవకు చెందిన మరో మాజీ అధికారిని తమ పార్టీలో చేర్చుకున్నారు కాట‌మ రాయుడు. తమిళనాడులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్‌ రావు జనసేన పార్టీలో చేరారు. దీంతో జనసేనాని వెంటనే ఆయనను తన రాజకీయ సలహాదారుగా నియమించారు. ప్రకాశం జిల్లాకు చెందిన రామ్మోహన్ రావు 1985 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.

వివాదాస్ప‌ద వ్య‌క్తి రామ్మోహ‌న్ జ‌న‌సేన‌లోకి..! ప‌వ‌న్ నిర్ణ‌యం ప‌ట్ల పార్టీలో అసంత్రుప్తి..!!

వివాదాస్ప‌ద వ్య‌క్తి రామ్మోహ‌న్ జ‌న‌సేన‌లోకి..! ప‌వ‌న్ నిర్ణ‌యం ప‌ట్ల పార్టీలో అసంత్రుప్తి..!!

రామ్మెహన్‌రావు.. గతంలో తమిళనాడు రాష్ట్రానికి సీఎస్‌గా పని చేశారు. అదే సమయంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో అనూహ్య ప‌రిణామాల మ‌ద్య రామ్మోహన్‌ చిక్కుకున్నారు. శేఖర్ రెడ్డి కూడా ఎవరికి బినామీగా ఉన్నారో చెప్పమంటే రామ్మోహన్ రావు పేరు చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఐటీ అధికారులు దీనిని పరిగణలోకి తీసుకోలేదు. కానీ, సంపాదించిన వందల కోట్లు ఎలా కాపాడుకోవాలంటూ రామ్మోహన్ రావు చేసిన ఫోన్ కాల్ ఆయన్ను కేసులో ఇరుక్కునేలా చేసింది. రామ్మోహన్‌పై పూర్తిగా నిఘా ఉంచిన అధికారులు ఈ ఫోన్ కాల్ ద్వారా ఆయన ఆఫీసు, ఆయన కుమారుడు వివేక్ రావు ఇళ్లలో సోదాలు నిర్వ‌హించారు.

అన్నీ ఆలోచించే నిర్ణ‌యం..! కుచ్ న‌హీ హోతా అంటున్న కాట‌మ‌రాయుడు..!!

అన్నీ ఆలోచించే నిర్ణ‌యం..! కుచ్ న‌హీ హోతా అంటున్న కాట‌మ‌రాయుడు..!!

ఆ సమయంలో 30 లక్షల విలువైన కొత్త 2వేల నోట్లు, 5 కిలోల బంగారం, మరో 5 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నోట్లు రద్దైన సమయంలో కొత్తగా వచ్చిన 2000 నోట్లు పెద్ద మొత్తంలో ఆయన వద్ద దొరకడం సంచ‌ల‌నంగా మారింది. దీంతో రామ్మోహన్ రావును సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం ఆయన స్థానంలో గిరిజా వైద్యనాథన్‌ను నియమించారు. అయితే, ఈ కేసు అన్నాడీఎంకే-బీజేపీ స్నేహం వల్ల మరుగున పడిపోయిందని అప్ప‌ట్టో రాజ‌కీయంగా పెద్ద చ‌ర్చ జ‌రిగింది. ఇప్పుడు ఈ అధికారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందలం ఎక్కించారు. తన సలహాదారుగా నియమించారు. దీనిపై జ‌న‌సైన పార్టీలో విమర్శలు వెల్లువెత్తుతున్నా గ‌బ్బ‌ర్ సింగ్ మాత్రం డోంట్ కేర్ అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం కొస మెరుపు..!!

English summary
Now this officer has been picked up by Janasena chief Pawan Kalyan. Appointed as his adviser. party cadre criticizing Grabber Singh's decision, but pavan kalyan is not caring those opinion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X