జగన్ పై దాడి కేసులో ప్రభుత్వానికి మరో దెబ్బ : హౌజ్ మోషన్ పిటీషన్ కు హైకోర్టు నో..!
జగన్ పై దాడి కేసులో ఏపి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కేసును ఎన్ఐఏ కు అప్పగించటంతో..వా రికి కావాల్సిన సమాచారం ఇవ్వటానికి సిట్ నిరాకరించింది. దీని పై ఎన్ఐఏ కోర్టు ను ఆశ్రయించగా..వివరాలను ఇవ్వాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. దీంతో..దీని పై ఏపి ప్రభుత్వం హైకోర్టులో హౌజ్ మోషన్ దాఖలు చేసింది. కానీ, కోర్టు ఆ పిటీషన్కు హైకోర్టు నో చెప్పింది..
తొలి నుండి వివాదాస్పదమే..
విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగిన నాటి నుండి రాజకీయంగా పలు ఆరోపణలు..విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కోడికత్తి దాడి అంటూ టిడిపి శ్రేణులు జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూనే..అది వైసిపి అభిమాని చేసిన దాడి గా చెబుతూ వస్తున్నారు. ఇక, దీని పై జగన్ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కోర్టులో మాత్రం రాష్ట్ర పోలీసుల తో కా కుండా..మూడో పార్టీతో విచారణ చేయించాలని కోరారు. అయితే హైకోర్టు జోక్యంతో కేంద్రం జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తప్పు బడుతోంది. తమ రాష్ట్ర పరిధిలో జరిగిన దాడి పై ఎన్ఐఏ ఎలా విచారణ చేస్తుందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసు విచారిస్తున్న ఎన్ఐఏ కు ఈ కేసు ఇప్పటికే విచారణ చేసిన సిట్ అధికారులు వివరాలు ఇవ్వటానికి ముందుకు రాలేదు. దీంతో..ఎన్ఐఏ తమకు కేసు వివరాలు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులోనూ చుక్కెదురు..
కేసు విచారణ కు వచ్చిన ఎన్ఐఏ కు వివరాలు అందించాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. దీంతో..వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని పై హైకోర్టు లో ఛాలెంజ్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ను తప్పించాలని కోరింది. అయితే, కోర్టు ఈ పిటిషన్ ను అంత అత్యవసరంగా విచారించవలసిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. హత్యయత్నం జరి గిన చోటు కేంద్రం పరిధిలో ఉందని చంద్రబాబు మాట్లాడారని, ఇప్పుడేమో కుట్ర ఎక్కడ భయటపడుతుందోనని, ఎన్‌ఐఏ విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో నిజాన్ని బయటకు రాకుండా ప్రభు త్వం ప్రయత్నిస్తోందని జగన్ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో..రానున్న రోజుల్లో ఈ కేసు వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి..