నిప్పుల కుంపటిగా ఏపీ.. రేపు కూడా హై టెంపరేచర్
నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి.. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిప్పుల కుంపటి కొనసాగుతోంది. తెలంగాణలో వేడి తీవ్రంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తక్కువేం కాదు. ఉక్క పోత.. వేడితో జనాలు అల్లాడిపోతున్నారు. ఏపీలో గత కొన్నిరోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
గతంలో రెంటచింతల వంటి ప్రాంతాల్లో 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యేది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఎండవేడి పెరిగిపోతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా కోస్తా, ఇతర ప్రాంతాల్లో భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రేపు కూడా రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

శుక్రవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఎండతీవ్రత పెరగనుందని తెలిపింది. 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 157 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది. ఈ మేరకు తీవ్ర వడగాడ్పులు వీచే 83 మండలాల జాబితాను కూడా పంచుకుంది. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications