దళితులకు వేధింపులు, శిరోముండన ఘటనపై సీఎం జగన్ సీరియస్.. తప్పు చేస్తే వదలబోం..
దళిత యువకుడు శిరోముండన ఘటనలో ఎవరూ తప్పుచేసిన తప్పేనని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. దళిత యువకుడిపై శిరోముండన ఘటనపై స్పందించారు. హక్కుల, చర్యలపై కానిస్టేబుళ్లు, ఏఎస్సై, ఎస్సైలకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

హోం మంత్రి దళిత్, డీజీపీ ఎస్టీ..
హోం మంత్రి దళిత సామాజిక వర్గానికి చెందిన వారు అని జగన్ స్పష్టంచేశారు. డీజీపీ ఎస్టీ అని.. బడుగు బలహీనవర్గాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని.. వారి హక్కుల రక్షణ పోలీసు శాఖదేనని స్పష్టంచేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ అతీతులు కాదు అని జగన్ తేల్చిచెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దళితులపై దాడులు, ఇతర ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఎంతటివారినైనా.. వదలబోం...
తప్పు చేస్తే ఎస్సైను పోలీసు స్టేషన్‌లో పెట్టిన ఘటన గతంలో జరగలేదని సీఎం జగన్ గుర్తుచేశారు. తప్పు చేసింది సీఐ అయినా.. ఎస్సై అయినా... అట్రాసిటీ కేసు పెట్టి చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇలాంటి ఘటన జరిగిన సమయంలో బంధువులే బాధితులైతే ఉపేక్షిస్తామా అని పోలీసు అధికారులను ప్రశ్నించారు. కానిస్టేబుళ్లు, ఏఎస్సై, ఎస్సైలు ప్రజల హక్కులపై ఎలా స్పందించాలనే అంశంపై అవగాహన కల్పించాలన్నారు.

ఇదీ విషయం..
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైసీపీ నేత ఇసుక అక్రమ రవాణాను దళిత యువకుడు వరప్రసాద్ గతనెలలో అడ్డుకున్నారు. అయితే అతనిని పోలీసు స్టేషన్ తీసుకెళ్లి దాడి చేయడమే గాక.. శిరోముండనం చేశారు. అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది. వెంటనే ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు. కానీ తనకు న్యాయం జరగలేదని వరప్రసాద్ మళ్లీ మీడియా ముందుకొచ్చారు. మాజీ సర్పంచ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదు అని.. తననే సూటి పోటీ మాటలు అంటున్నారని ప్రసాద్ చెప్పారు.
Recommended Video

రాష్ట్రపతికి లేఖ రాయడంతో...
నక్సలైట్లలో కలవాలని నిర్ణయం తీసుకున్నానని రాష్ట్రపతికి లేఖ రాశారు. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించడంతో విచారణ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో దళితులపై దాడులు, శిరోముండనం ఘటనలపై ఉపేక్షించబోమని సీఎం జగన్ స్పష్టంచేశారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications