అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ -ప‌వ‌న్ కు ఇక‌ త‌ప్ప‌దా : బాబు ట్రాప్ లో చిక్కుతారా : ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారు..!

|
Google Oneindia TeluguNews

జ‌గ‌న్- ప‌వ‌న్‌ దారెటు. ఏపి తో పాటుగా జాతీయ రాజ‌కీయాల్లో జ‌గ‌న్-ప‌వ‌న్‌ ఎవ‌రి వైపు మ‌ద్ద‌తు గా నిలుస్తారు. ఇప్ప‌టికే టిడిపి అధినేత కాంగ్రెస్ తో చేతులు క‌లిపారు. బిజెపి ని ఏపిలో ద్రోహం చేసిన పార్టీగా ప్రచారం జ‌రుగుతోంది. ఏపికి హోదా ఇస్తామ‌ని కాంగ్రెస్ అధినేత ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మ‌రి..హోదా కోసం డిమాండ్ చేసే వైసిపి - జ‌న‌సేన పార్టీల అధినేత‌లు దీనిని సాధించుకోవ‌టానికి ఉన్న మార్గం ఏంటి..చంద్ర‌బాబు ట్రాప్ లో చిక్కుతారా..లేక ఉన్న ఏకైక ప్ర‌త్యామ్నాయంతోనే వెళ్తారా..

చంద్ర‌బాబు ట్రాప్‌..త‌ప్పించుకుంటారా

చంద్ర‌బాబు ట్రాప్‌..త‌ప్పించుకుంటారా

ఏపిలో ఎవ‌రు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తార‌నేది అర్దం కాని విష‌యం. ఏపిలో కాంగ్రెస్ -టిడిపి క‌లిసి పోటీ చేస్తారా..లేక విడివిడిగా పోటీ చేస్తారా అనేదీ ఇంకా సస్పెన్సే. వైసిపి - జ‌న‌సేన మ‌ధ్య పొత్తు పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే కొద్ది రోజులుగా రెండు పార్టీల అధినేతల మ‌ధ్య సాగుతున్న మాట‌ల యుద్దంతో పొత్తు క‌ష్ట‌మేన‌నే అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో..

జాతీయ రాజ‌కీయాల్లోనూ టిడిపి ముంద‌డుగు వేసింది. ఏపికి బిజెపి ద్రోహం చేసింద‌ని.. కాంగ్రెస్ ప్ర‌త్యేక హోదాకు హామీ ఇవ్వ‌టంతో వారితో క‌లిసామ‌ని టిడిపి అధినేత చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు వారు టిడిపి భాగ‌స్వామిగా ఉన్న కాంగ్రెస్ కూట‌మిలోకి వెళ్ల‌లేరు..బిజెపి కి మద్ద‌తు ఇవ్వ‌లేరు. కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే ఏపికి మేలు చేస్తామ‌ని చెప్పిన పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం టిడిపి నుండి మొద‌ల‌వుతుంది. అదే స‌మ‌యంలో వైసిపి - జ‌న‌సేన లు ఏపికి ద్రోహం చేసింది కాంగ్రెస్ అనే నినాదం వినిపించినా...

ఇప్పుడు మేలు ఎవ‌రు చేస్తార‌నే చ‌ర్చ లో మాత్రం వారు స‌మాధానం చెప్పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. దీంతో..చంద్ర‌బాబు ఈ రెండు పార్టీల‌ను జాతీయ స్థాయిలో ఏ నిర్ణ‌యం తీసుకున్నా..రాజ‌కీయంగా ఇబ్బందులు సృష్టించేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసారు.

ఆర్జీవీ బోల్డ్ ..టిడిపి బౌల్డ్ : వ‌ర్మ ను కంట్రోల్ చేయాల్సిందే : ప‌సుపు ద‌ళం ఎదురు దాడి..! ఆర్జీవీ బోల్డ్ ..టిడిపి బౌల్డ్ : వ‌ర్మ ను కంట్రోల్ చేయాల్సిందే : ప‌సుపు ద‌ళం ఎదురు దాడి..!

కెసిఆర్ ఫ్రంట్ తో క‌లిస్తే...లాభ‌మా - న‌ష్ట‌మా..

కెసిఆర్ ఫ్రంట్ తో క‌లిస్తే...లాభ‌మా - న‌ష్ట‌మా..

వైసిపి - జ‌న‌సేన పార్టీలు రెండు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న రెండు కూట‌ముల్లో ఎందులో చేరినా రాజ‌కీయంగా ఏపి లో న‌ష్టం త‌ప్ప‌దనే అంచ‌నాలో ఉన్నాయి. దీంతో..కెసిఆర్ సార‌ధ్యంలో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న ఫెడ‌ర‌ల్ ఫ్రం ట్ ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తోంది. కేసిఆర్ తో పాటుగా ఇప్ప‌టికే ఎంఐఎం భాగ‌స్వామిగా ఉంది. ఇక‌, బిజెడి, తృణ‌మూ ల్‌, ఎస్పీ, బిఎస్పీ పార్టీలు సైతం నాన్ కాంగ్రెస్ - నాన్ బిజెపి అజెండాతో ఉన్నాయి. వీరిని త‌మ ఫ్రంట్ లోకి తెచ్చేందు కు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇప్పుడు వైసిపి - ప‌వ‌న్ సైతం ఇదే ఫ్రంట్ లో చేరుతార‌ని కేసిఆర్ అంచనాగా క‌నిపిస్తోంది. దీనిలో భాగంగానే..వారిద్ద‌రి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి అయిన చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ..వారిని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు కేసిఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ - ప‌వ‌న్ ఇద్ద‌రూ కేసిఆర్ గురించి.. ఫ్రంట్ గురించి ఎక్క‌డా మాట్లాడ లేదు. చంద్ర‌బాబు మాత్రం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు నిరుప‌యోగంగా చెబుతున్నారు..

అక్క‌డ క‌లిస్తే..ఇక్క‌డా క‌ల‌వాల్సిందేనా..

అక్క‌డ క‌లిస్తే..ఇక్క‌డా క‌ల‌వాల్సిందేనా..

ఇప్పుడు ఏపిలో నాలుగు ప్ర‌ధాన పార్టీలు ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌ధానాస్త్రంగా మ‌ల‌చుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వ‌స్తే ఏపికి హోదా పైనే తొలి సంత‌కం చేస్తామ‌ని చెబుతోంది. ఇక‌, కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేర‌కే ఏపి ప్ర‌యోజ‌నాల కోసం తాము కాంగ్రెస్ తో క‌లిసామ‌ని టిడిపి వివ‌ర‌ణ ఇస్తోంది. ఇక‌, ఎవ‌రైతే ప్ర‌త్యేక హోదా ఇస్తారో వారికే మా మ‌ద్ద‌తు అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. ప‌వ‌న్ సైతం హోదా డిమాండ్ చేస్తున్నారు.

మ‌రి..కెసిఆర్ ఫ్రంట్ తో జ‌గ‌న్ - ప‌వ‌న్ క‌లిస్తే రాష్ట్ర స్థాయిలోనూ వీరిద్ద‌రి పొత్తు అనివార్యం గా మారే ప‌రిస్థితి ఉంది. అయితే, వీరిద్ద‌రూ ఒక్క‌టై కేసిఆర్ ఫ్రంట్ లో చేరితే ఏపికి వ్య‌తిరేకి అయిన కేసిఆర్ తో చేతులు క‌లిపార‌ని టిడిపి ప్ర‌చారం చేసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అయితే, కేంద్రంలో వ‌చ్చే ఫ‌లితాలు ఆధారంగా వీరి మ‌ద్ద‌తు డిసైడ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. ఏది ఏమైనా..ఇప్పుడు జ‌గ‌న్‌- ప‌వ‌న్ రాజ‌కీయంగా ఎటువంటి అడుగులు వేస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది...

English summary
Jagan - Pawan support which alliance in national politics. Both may support KCR proposing Federal Front. If they both support Federal Front..then they have to prepare for alliance in AP also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X