అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ వ‌ర్సెస్ ప‌వ‌న్ : ఇక ప‌వ‌న్ ను ఉపేక్షించ‌కండి : పొత్తు ఉత్తిమాటేనా..!

|
Google Oneindia TeluguNews

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ను ఒక ఉప‌క్షేంచకూడ‌ద‌ని వైసిపి అధినేత డిసైడ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న ప్ర‌సంగాల్లో చంద్ర‌బాబు - లోకేష్ ను ల‌క్ష్యంగా చేసుకొని మాట్లాడుతుండ‌టంతో వైసిపి..ప‌వ‌న్ విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించింది. ఒక ద‌శ‌లో వైసిపి - జ‌న‌సేన మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు ఉంటుంద‌నే ప్రచారం జ‌రిగింది. అయితే, కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న ప్ర‌సంగాల్లో జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో.. ఇంకా ఉపేక్షిస్తే....ప్ర‌జ‌ల్లోకి వ్య‌తిరేక సంకేతాలు వెళ్తాయ‌ని వైసిపి నేత‌లు అంచ‌నాకు వ‌చ్చారు. దీంతో..ఇక ప‌వ‌న్ ను టిడిపి కి మిత్రుడుగా ప్ర‌చారం చేయాల‌ని..ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను అదే స్థాయిలో తిప్పి కొట్టాల‌ని డిసైడ్ అయ్యారు. దీంతో.. ఇక నుండి ప‌వ‌న్ వ‌ర్సెస్ జ‌గ‌న్ గా ఏపి రాజ‌కీయంలో కొత్త కోణం క‌నిపంచ‌నుంది...

Recommended Video

జగన్ ను హెచ్చరించిన పవన్...! | Oneindia Telugu
ప‌వ‌న్ ను వ‌దిలేస్తే న‌ష్టమే..

ప‌వ‌న్ ను వ‌దిలేస్తే న‌ష్టమే..

ప‌వ‌న్ త‌న ప్ర‌సంగాల్లో జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌తీ సంద‌ర్భంలోనూ జ‌గ‌న్ త‌న ఎమ్మె ల్యేల‌ను కాపాడుకోలేక పోయార‌ని..అసెంబ్లీకి వెళ్ల‌కుండా రోడ్ల మీద తిరుగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.

జ‌గ‌న్ స్థానంలో తాను ఉంటే ఒక్క‌డిగా అయినా అసెంబ్లీ కి వెళ్లి ప్ర‌భుత్వ అవినీతి పై పోరాడేవాడిన‌ని ప‌వ‌న్ చెప్పుకొస్తున్నారు. జ‌గ‌న్ శ‌క్తి సామ‌ర్ధ్యాల పై మీద ప‌వ‌న్ అనేక విమ‌ర్శ‌లు చేసారు. ఇక‌, జ‌గ‌న్ అవినీతి పైనా..వేల కోట్లు దోచుకున్నారంటూ..16 నెల‌లు జైళ్లో ఉన్న వ్య‌క్తి ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఎలా అర్హుడ‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నిస్తున్నారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తున్నార‌ని.. తాను జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యాలు బ‌య‌ట పెడితే త‌ట్టుకోలేర‌ని హెచ్చ‌రిస్తున్నారు. దీని పై వైసిపి శిబిరం లో అంత‌ర్మ‌ధ‌నం జ‌రిగింది. చంద్ర‌బాబు తో మిత్రుడుగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్ పై వైసిపి నుండి అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే విమ‌ర్శ‌లు వినిపించేవి. కానీ, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు త‌గిన రీత‌లో స్పందించ‌కుంటే న‌ష్ట‌మేన‌ని వైసిపి అంచ‌నాకు వ‌చ్చింది. దీంతో..ఇక టిడిపి తో స‌మానంగా ప‌వ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని వైసిపి నిర్ణ‌యించింది.

 టిడిపి కోస‌మే ప‌వ‌న్‌..ఇదే ప్ర‌చారాస్త్రం..

టిడిపి కోస‌మే ప‌వ‌న్‌..ఇదే ప్ర‌చారాస్త్రం..


ప‌వ‌న్ క‌ళ్యాన్ ను టిడిపికి మేలు చేసే వ్య‌క్తిగానే ప్రచారం చేయాల‌ని వైసిపి డిసైడ్ అయింది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యం లో ప‌వ‌న్ జ‌గ‌న్ - వైయ‌స్ ను ఉద్దేశించి అనేక ఆరోప‌ణ‌లు చేసారు. కానీ, ప‌వ‌న్ ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నే భావ‌న‌తో వైసిపి నేత‌లు ప‌వ‌న్ ను విస్మ‌రించారు. అప్ప‌ట్లో ష‌ర్మిళ మాత్ర‌మే ప‌వ‌న్ ను విమ‌ర్శించారు. కానీ, ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కార‌ణంగా టిడిపి లాభ‌ప‌డింద‌ని ఆ త‌రువాత వైసిపి నేత‌లు గుర్తించారు. ఈ సారి మాత్రం ఎక్క‌డా ప‌వ‌న్ ను విస్మ‌రించ‌కుండా..టిడిపి తో స‌మానంగా కార్న‌ర్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ప‌వ‌న్ త‌న ప్ర‌సంగాల్లో అధికారంలో ఉన్న పార్టీని కాకుండా..ఎక్కువ‌గా త‌నను విమ‌ర్శించ‌టాన్ని జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. లోకేష్ అవినీతి పై మాత్ర‌మే మాట్లాడుతూ..ప‌వ‌న్ అంత వ‌ర‌కే పరిమితం అవుతున్నార‌ని...ఎమ్మెల్యేల కొన‌గోళ్లు..పోల‌వ‌రంలో అవినీతి, ప్ర‌త్యేక హోదా పై యూ ట‌ర్న్ వంటి అంశాల పై ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌క‌పోవ‌టాన్ని వైసిపి నిల‌దీయాల‌ని డిసైడ్ అయింది. ఇక‌, టిడిపిక ఓట్ల ప‌రంగా న‌ష్టం చేసే ప్రాంతాల్లోనే ప‌వ‌న్ సుదీర్ఘంగా ప‌ర్య‌టిస్తూ..ఓట్ల చీల‌క‌కు ప‌రోక్షంగా టిడిప‌కి స‌హ క‌రిస్తున్నార‌నే విష‌యం బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించింది.

జ‌గ‌న్ - ప‌వ‌న్ పొత్తు..ఇక ఉత్తి మాటేనా..

జ‌గ‌న్ - ప‌వ‌న్ పొత్తు..ఇక ఉత్తి మాటేనా..


టిడిపికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న జ‌డ‌న్ - ప‌వ‌న్ ఇద్ద‌రూ క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుంటార‌నే ప్ర‌చారం కొంత కాలంగా ఏపిలో బ‌లంగా సాగుతోంది. పొత్తు ఖాయ‌మ‌నే విధంగా టిడిపి నేత‌లు ఓ అంచ‌నాకు వ‌చ్చారు. దీని పై వైసిపి - జ‌న‌సేన పార్టీల్లో నిర్ణ‌యం దిశ‌గా చ‌ర్చ‌లు సాగిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే, ఒంట‌రిగా వెళ్లేందుకే జ‌గ‌న్ ఇష్ట‌ప‌డుతున్నారు. వ‌ప‌న్ సైతం క‌మ్యూనిస్టులు..ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకొనే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నారు. దీంతో..ఇక ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు అనే అంశం ఇప్ప‌టికైతే ఉత్తి మాట‌గానే క‌నిపిస్తోంది. ఇదే స‌మయంలో.. ప్ర‌తిప‌క్షం లో ఉన్న జ‌గ‌న్ ను ప‌వ‌న్ ల‌క్ష్యంగా చేసుకోవటం... జ‌గ‌న్ పై దాడి విష‌యంలో ప‌వ‌న్ చేసిన కామెంట్ల‌ను వైసిపి అధినేత జ‌గ‌న్ సీరియ‌స్ గా తీసుకున్నారు. ప‌వ‌న్ పై కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ పెళ్లిళ్ల పై జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల ను ప‌వ‌న్ సీరియ‌స్‌గానే తిప్పి కొట్టారు. ఏపిలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ప‌వ‌న్ తో జ‌గ‌న్ జ‌ట్టు క‌డ‌తార‌నే ప్ర‌చారానికి..ఇప్పుడు ప‌వ‌న్ వ‌ర్సెస్ జ‌గ‌న్ గా మారుతున్న రాజ‌కీయంలో ఇక సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌టం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇది మ‌రింత వైరంగా మారుతుందో లేక సంధి కుదురుతుందో చూడాలి..

English summary
Ycp decided to not ignore Pawan Klayan comments on Jagan. YCP feels pawan indirectly helping TDP in Ap politics. now onwards YCP decided to counter Pawan Kalyan on his political comments. YCP and Janansena alliance also may not possible in future politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X