రూ.కోటి విరాళం: జల్సా మూవీ రిలీజ్ ద్వారా అర్జన, పవన్‌కు అందజేత
జల్సా మూవీ ప్రదర్శించి రూ.కోటి ఆర్జించారు జన సైనికులు. ఆ మొత్తాన్ని గురువారం రోజున పవన్ కల్యాణ్‌కు అందజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'జల్సా' మూవీ రీ రిలీజ్ చేశారు. అలా ఆ మొత్తం సంపాదించారు. 'నా సేన కోసం నా వంతు' అనే కార్యాచరణలో భాగంగా మూవీని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేశారు.
జనసైనికులు సాయిరాజేష్, ఎస్కేఎన్, సతీష్ భొట్ట, ధర్మేంద్ర 'జల్సా' చిత్ర ప్రదర్శన ద్వారా రూ.1 కోటి విరాళం సేకరించారు. ఈ విరాళం చెక్కును జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు చేతులమీదుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు అందించారు. సాయిరాజేష్, ఎస్కేఎన్ తదితరులను నాగబాబు అభినందించారు. వారి అభిమానం పవన్‌తో ఫొటో కోసం ఆగకుండా కోటి రూపాయలు సేకరించే స్థాయికి ఎదిగిందని కొనియాడారు.

పార్టీకి ఉపయోగపడే పని ఏదైనా చేసి పవన్ కల్యాణ్‌ను కలవాలి అనే వారి సంకల్పం ప్రశంసనీయం అని నాగబాబు పేర్కొన్నారు. జల్సా చిత్ర ప్రదర్శన కోసం వారికి ఉమా నాగేంద్ర శ్రీధర్, యతీంద్ర, జ్ఞానవర్ష, నవీన్ వారికి సహకారం అందించారని తెలిపారు. వారంతా కలిసి ఈ మొత్తం కలెక్ట్ చేశారు.
పార్టీ కోసం వారు చేసిన పనిని అభినందించారు. చాలా మంచి పనిచేశారని కొనియాడారు. మిగతా వారికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసల్లో ముంచెత్తారు. తమ పార్టీ నిర్మాణ ప్రక్రియ వేగంగా జరుగుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications