ఎన్నికల ముందు ప్రజల్లోకి : నేటి నుంచి జన్మభూమి-మా ఊరు..
ఎన్నికల ఏడాది ప్రారంభం కావటంతో ఇక ప్రజల్లో ఉండాలని ఏపి అధికార పార్టీ టిడిపి నిర్ణయించింది. దీని కోసం ఈ రోజు నుండి ఈ నెల 11 వ తేదీ వరకు జన్మభూమి - మా ఊరు పేరుతలో గ్రామ గ్రామాన ప్రజలతో మమేకం కావాలని అ టు పార్టీ..ఇటు ప్రభుత్వ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. గ్రామ సభల్లో ప్రజా సమస్యలు తెలుసుకొని అక్క డికి అక్కడే పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.

జన్మభూమి
సార్వత్రిక ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో..ఏపిలో ప్రభుత్వం ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించింది. దీని కోసం జన్మభూమిని వేదికగా మలచుకుంటోంది. గత నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై గ్రామస్థాయిలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
‘జన్మభూమి- మా ఊరు'
మంగళవారం నుంచి 11వ తేదీ వరకూ ఆరో విడత ‘జన్మభూమి- మా ఊరు' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రధానంగా రాష్ట్రాభివృద్ధిపై విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై గ్రామసభల్లో చర్చించడంతో పాటు, ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, గ్రామ స్థాయిలో వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు పురస్కారాల అందజేత, ఆహారోత్సవాలు, 5కె రన్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు. సమగ్ర గ్రామాభివృద్ధికి సంబంధించిన వ్యూహ ప్రణాళికలను చివరి రోజు విడుదల చేసే విధంగా కార్యాచరణ సిద్దమైంది. ప్రతీ జిల్లలో సమర్దవంతంగా నిర్వహించేందుకు మంత్రులు..ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు సీయం టూర్..
జన్మభూమి నిర్వహించే పది రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు 13 జిల్లాల్లో పర్య టిస్తారు. గ్రామసభల్లో పాల్గొంటారు. మొదటి రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. జన్మభూ మి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. 13 జిల్లాల్లోని 51 రెవె న్యూ డివిజన్లలో 31 మంది ఐఏఎస్, మరికొందరు కేంద్ర సర్వీసులకు చెందిన అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.
వివిధ శాఖలతో ప్రణాళిక శాఖ సమన్వయం చేసుకుని పర్యవేక్షించనుంది. ప్రతీ జిల్లాలో ఇన్‌ఛార్జ్ మంత్రి..జిల్లా మంత్రులు..స్థానిక ఎమ్మెల్యేలు సభలో పాల్గొంటారు. స్థానికంగా వచ్చే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి..అక్కడికక్కడే పరిష్కారం చూపేందుకు చొరవ చూపించనున్నారు.












Click it and Unblock the Notifications