అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ వ‌ర్సెస్ చంద్ర‌బాబు : ఇద్ద‌రి భ‌విష్య‌త్‌కు స‌వాల్‌ : గెలిచేదెవ‌రు..!

|
Google Oneindia TeluguNews

ఇద్ద‌రూ రాజ‌కీయ ఉద్దండులే . త‌మ రాజ‌కీయ వార‌సుల కోసం వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు ఆ ఇద్ద‌రు నేత‌లు. వారి రాజ‌కీయ ల‌క్ష్యాలకు తెలంగాణ ఎన్నిక‌లు స‌వాల్ గా మారుతున్నాయి. తొలుత కాంగ్రెస్ వ‌ర్సెస్ టిఆర్‌య‌స్‌గా ప్రారంభ‌మై న తెలంగాణ ఎన్నిక‌లు..ఇప్పుడు చంద్ర‌బాబు వ‌ర్సెస్ కెసిఆర్ గా మారుతున్నాయి. అనూహ్యంగా కాంగ్రెస్ తో చేతులు క‌లిపి ఎలాగైనా కెసిరా్ను ఓడించి..అటు ఏపిలో..ఇటు తెలంగాణ‌తో పాటుగా కేంద్ర భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లోనూ త‌న ముద్ర వేసుకోవాలనే ల‌క్ష్యంతో చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ లో త‌న ప‌ట్టు నిరూపించుకొని..జాతీయ రాజ‌కీ యాల్లోనూ త‌న వ్యూహం అమ‌లు చేయాల‌ని కెసిఆర్ ముందుకు వెళ్తున్నారు. దీంతో..తెలంగాణ ఎన్నిక‌లు ఇప్పుడు ఈ ఇద్ద‌రి నేత‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్ కు స‌వాల్ గా మారుతున్నాయి. మ‌రి..ఇద్ద‌రి లో గెలిచేదెవ‌రు..

వ్యూహాత్మ‌కంగానే ఇద్ద‌రి ఎత్తులు - పై ఎత్తులు..

వ్యూహాత్మ‌కంగానే ఇద్ద‌రి ఎత్తులు - పై ఎత్తులు..

తొలుత తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఉనికి కోస‌మే పోరాడాల‌ని టిడిపి పోరాటం చేస్తుంద‌ని అందరూ అంచ‌నా వేసారు . కానీ, త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ తీసేందుకు కెసిఆర్ ప్ర‌య‌త్నించార‌ని..ఆయ‌న పై రాజ‌కీయంగా పై చేయి సాధించా ల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఆ వెంట‌నే రేవంత్ రెడ్డి టిడిపి ని వీడ‌టం ద‌గ్గ‌ర నుండి కాంగ్రెస్ తో పొత్తు దాకా బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. స‌మ‌యం కోసం ఎదురు చూసారు. తెలంగాణ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అయిన వెంటే వ్యూహాల‌ను అమ‌లు చేసారు. అటు కేంద్రంలో మోదీని..ఇటు తెలంగాణ లో కెసిఆర్ ను రాజ‌కీయంగా దెబ్బ కొట్టాల‌ని డిసైడ్ అయ్యారు. వెంట‌నే త‌న చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి కాంగ్రెస్ తో చేతులు క‌లిపారు. ఇక‌, రాహుల్ వ‌ద్ద‌కే తాను వెళ్లి..త‌న చ‌తుర‌త‌తో తెలంగాణ కాంగ్రెస్ పై ప‌ట్టు సాధించారు. ఫ‌లితంగా ఇప్పుడు బాబు వ్యూహాల‌తోనే కాంగ్రెస్ నేత‌లు క‌దులుతున్నారంటే అతి శ‌యోక్తి కాదు. ఇదే స‌మ‌యంలో..త‌న అడ్డాలో చంద్ర‌బాబు వేస్తున్న ఎత్తుల‌ను తిప్పి కొట్టేందుకు కెసిఆర్ త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. సెంటిమెంట్ తో చంద్ర‌బాబును తిప్పి కొట్టాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసారు. కాంగ్రెస్ కంటే బాబు పైనే ఎక్కువ‌గా టార్గెట్ చేసారు. ఆంధ్ర సెటిల‌ర్స్ ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాగైనా గెలిచి తనను ల‌క్ష్యంగా చేసుకున్న చంద్ర‌బాబు కు ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని కెసిఆర్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ఎవ‌రి ల‌క్ష్యాల కోసం వారు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు.

Recommended Video

Telangana Elections 2018 : రోడ్ షో లో చంద్ర‌బాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు | Oneindia Telugu
చంద్రుల‌ ప్ర‌తిష్ఠ - స‌మ‌ర్ధ‌త‌కు స‌వాల్‌..

చంద్రుల‌ ప్ర‌తిష్ఠ - స‌మ‌ర్ధ‌త‌కు స‌వాల్‌..

ఇప్పుడు తెలంగాణ ఎన్నిక‌లు ఒక ర‌కంగా కెసిఆర్ .. చంద్ర‌బాబు ప్ర‌తిష్ఠ‌కు..స‌మ‌ర్ధ‌తకు స‌వాల్ గా మారుతున్నాయి. ఈ ఎన్నిక‌ల ద్వారా త‌మ స‌మ‌ర్ధ‌త ఏంటో నిరూపించుకోవ‌టం ఇద్ద‌రికీ అనివార్యంగా మారింది. కాంగ్రెస్ తో చేతులు క‌లిపి న చంద్ర‌బాబు..తెలంగాణ లో 13 సీట్లలోనే పోటీ చేస్తున్నా...కెసిఆర్ రాజ‌కీయ వ్యూహాల‌కు చెక్ పెట్టే నేత‌గా కాంగ్రెస్ అధి నాయ‌క‌త్వం భావిస్తోంది. ఇందు కోసం బాబు వ‌ద్ద‌కే కాంగ్రెస్ సీనియ‌ర్లు వెళ్లి..వ్యూహాలు ర‌చిస్తున్నారు. తాను ఏపి కి మాత్ర‌మే ప‌రిమితి కాద‌ని..జాతీయ స్థాయిలో త‌న స‌త్తా చాటుకోవాలంటే తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌న స‌మ‌ర్ధ‌త‌ను చాటుకో వాల‌నేది చంద్ర‌బాబు ల‌క్ష్యం. తెలంగాణ ఫ‌లితాలు ఇప్పుడు ఏపిలోనూ చంద్ర‌బాబు భ‌విష్య‌త్ ను డిసైడ చేసే స్థాయికి చేరాయి. దీని కోసం ఏపిలో పాల‌నా వ్య‌వ‌హారాల‌ను ప‌క్క‌న పెట్టి హైద‌రాబాద్‌లోనే బాబు మ‌కాం వేసారు. ఇక‌, టిఆర్‌య‌స్ ఈ ఎన్నిక‌ల్లో గెలిచి..ఇక తెలంగాణ లో కాంగ్రెస్ -టిడిపి కి రాజ‌కీయంగా అవ‌కాశం లేకుండా చేయాల‌నేది కెసిఆర్ వ్యూహం. రెండు ప్ర‌ధాన పార్టీలు కూటమిగా..బిజెపి సైతం ప్ర‌త్య‌ర్ధి పార్టీగా త‌నను రాజ‌కీయంగా దెబ్బ కొట్టేందు కు వ‌స్తున్నార‌ని చెబుతున్న కెసిఆర్ ఎన్నిక‌ల్లో వారిని ఓడించి..త‌న స‌మ‌ర్ధ‌త‌ను చాటుకోవాల‌ని భావిస్తున్నారు. తాజా ఎన్నిక‌ల్లో గెలుపు ద్వారా..సొంత రాష్ట్రంతో పాటుగా త‌న‌కు పోటీగా బిజెపి ఇత‌ర పార్టీలంటూ జాతీయ స్థాయిలో రాజ‌కీయం మొద‌లు పెట్టిన చంద్ర‌బాబుకు చెక్ పెట్టాల‌ని కెసిఆర్ ల‌క్ష్యం.

తెలంగాణ ఫ‌లితాలే.. ముఖ్య‌మంత్రుల భ‌విష్య‌త్ కు అడుగులు..

తెలంగాణ ఫ‌లితాలే.. ముఖ్య‌మంత్రుల భ‌విష్య‌త్ కు అడుగులు..

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇప్పుడు ఇద్ద‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్ తో ముడి ప‌డి ఉంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు ఆమోదిస్తున్నార‌ని..తెలంగాణ ఎన్నిక‌ల్లో కూట‌మి గెలుపు ద్వారా చాటి చెప్పాల‌ని...తద్వారా ఈ ఫ‌లితాల‌నే ఏపిలో విస్తృతంగా ప్రచారం చేసి ప్ర‌యోజ‌నం పొందాల‌ని చంద్ర‌బాబు వ్యూహం. దీని కోసం తెలంగాణ తో సంబంధం లేని ఏపి నేత‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా నియ‌మించారు. త‌న నిఘా వ్య‌వ‌స్థ‌తో పాటు గా పేరున్న స‌ర్వే సంస్థ‌ల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం తెప్పించుకుని త‌న పార్టీతో పాటుగా కాంగ్రెస్ నేత‌ల‌కు సూచ‌న‌లు - స‌ల‌హాలు ఇస్తున్నారు. త‌న కుమారుడికి రాజ‌కీయంగా తోడ్పాటు అందించాలంటే కేవ‌లం ఏపి రాజ‌కీయా ల‌కే ప‌రిమితం అవుతే స‌రి పోద‌ని..త‌న గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెర‌గాల‌నేది చంద్ర‌బాబు అస‌లు ల‌క్ష్యం. ఇక‌, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో గెలవటం ద్వారా తెలంగాణ లో భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో త‌న‌కు తిరుగు లేకుండా..త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ కు రాజ‌కీయంగా రూట్ క్లియ‌ర్ చేసుకోవాల‌ని కెసిఆర్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇప్పుడు అధికారంలోకి వ‌స్తే వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దాని ప్ర‌భావం ఉంటుంద‌ని..ఎక్కువ సీట్లు గెల‌వ‌టం ద్వారా జాతీయ స్థాయిలోనూ త‌న శ‌క్తి ఏంటో నిరూపించుకోవాల‌ని కెసిఆర్ భావిస్తున్నారు. మ‌రి..ఇద్ద‌రి ల‌క్ష్యాలు..వారి వ్యూహాలు క్షేత్ర స్థాయిలో ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో..అదిరింద‌య్యా చంద్రం అని ఎవ‌రు అనిపించుకుంటారో 11వ తేదీ వ‌ర‌కు వేచి చూడాల్సిందే..

English summary
Telangana Elections taken new turn. Now elections become personal prestige of both Andhra and Telangana Chief Ministers . now Political war became KCR vs Chandra Babu. Both playing own strategies for election winning. This elections creating more in interest in AP also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X