రాక్షసుడు కాదు రక్షకుడు, వైఎస్ఆర్‌పై కొడాలి నాని.. కామెంట్స్ తగదు
మాజీ సీఎం వైఎస్ఆర్‌పై తెలంగాణ మంత్రులు విరుచుకుపడుతున్నారు. ఆయన రాక్షషుడు అని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేశారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. మనతో లేనివారిపై కామెంట్స్ చేయడం తగదన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాక్షసుడు కాదని, రక్షకుడని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నరరూస రాక్షసుడు అని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆ వ్యాఖ్యలు సరికాదు అని ఖండించారు. ఆయన బ్రతికి ఉంటే రాష్ట్రం ఇలా ఉండేదికాదని, రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడినవారు రాజశేఖరరెడ్డి అని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.

ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి వుంటాయని కొడాలి నాని తెలిపారు. ఆ రాష్ట్ర ప్రయోజనాలు వారు చూసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు ఆరు నెలలకు ఓ సారి రాష్ట్రానికి వస్తారు, పోతారు అని సెటైర్లు వేశారు. పబ్లిసిటీ కోసం ఏదో ఒక సాధన దీక్షచేసి మరలా వెళ్లిపోతాడని అన్నారు. టీడీపీని తొక్కి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందని, బీజేపీని ఏపీలో ఒక పర్సెంటేజ్ కూడా పట్టించుకొనేవారు లేరని తెలిపారు. బీజేపీకి జనసేనతో కలిసి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో మనం చూశామని ఆయన అన్నారు.
వైఎస్ జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అందరికీ తెలుసు అని కొడాలి నాని అన్నారు. బీజీపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో త్వరలో బయటకు వస్తాయని కొడాలి నాని అన్నారు.












Click it and Unblock the Notifications