తెలంగాణ పై నోరు విప్పిన ఏపి ఆక్టోపన్ : అంత వరకే తేల్చేరు..వారికే ఆ సీట్లు..!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పై ఎట్టకేలకు ఆంధ్రా ఆక్టోపన్ లగడపాటి రాజగోపాల్ నోరు విప్పారు. తెలంగాణ లో హోరా హోరీగా మారిన ఎన్నికలతో అక్కడ ఎవరు గెలుస్తారనే దాని పై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. అయితే, ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా చెబుతారనే నమ్మకం తో లగడపాటి వైపు అందరి దృష్టి నెలకొంది. కానీ, లగడపాటి మాత్రం ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం మాత్రమే సర్వే వివరాలు చెబుతానని చెబుతున్నారు. కొందరు పోటీలో ఉన్న నేతలు లగడపాటికి దగ్గరగా ఉన్న వారి ద్వారా తమ నియోజకవర్గ ఫలితాలు తెలుసుకొనే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో లగడపాటి తిరుమల వేదికగా నోరు విప్పారు...వారికే ఆ సీట్లని తేల్చారు...
రోజురోజుకీ టెన్షన్ పెంచుతున్న తెలంగాణ ఎన్నికల పై ఆంధ్రా ఆక్టోపస్..మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఎట్టకేలకు నోరు విప్పారు. తిరుమల లో శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి తెలంగాణ ఎన్నికల్లో తన అంచనాలను పూర్తి స్థాయి లో చెప్పకపోయినా..కొంత వరకు బయట పెట్టే ప్రయత్నం చేసారు. ఇప్పటికే సోషల్ మీడియాలో లగడపాటి పేరుతో అనేక సర్వేలు చెక్కర్లు కొడుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా వాటిని మలచుకొని ప్రచారం చేసుకుంటున్నాయి.

కానీ, లగడపాటి మాత్రం ఎన్నికలు పూర్తయ్యే వరకు డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం మాత్రమే తాను తెలంగాన ఎన్నికల పై స్పందిస్తానని స్పష్టం చేసారు. అయితే, తెలంగాణలో ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న తీరు.. పార్టీల బలాబలాలకు అనుగుణంగా పరిశీలిస్తే ప్రధాన పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు ఓట్లు వేయబోతున్నారని తేల్చి చెప్పారు. తాను ఎన్నికలు జరిగే వరకూ రోజుకు రెండు స్థానాల మేర గెలిచే అభ్యర్ధుల పేర్లు వెల్లడిస్తానని లగడపాటి ప్రకటించారు. దీంతో..లగడపాటి ఏ రోజు ఏ స్థానం అభ్యర్ధిని ప్రకటిస్తారో అనే ఉత్కంఠ మొదలైంది.
ఆ స్థానాల్లో వారే గెలుపు..
లగడపాటి తిరుమల వేదికగా తొలి రోజు రెండు స్థానాల్లో గెలిచే అభ్యర్ధులను ప్రకటించారు. అందులో ఒకటి మహబూబ్ నగర్ నారాయణ్‌పేట్ కాగా... రెండో నియోజకవర్గం అదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధులే గెలుస్తారని లగడపాటి తేల్చి చెప్పారు. నారాయన్‌పేట్ లో స్వతంత్ర అభ్యర్ధి శి
వకుమార్ రెడ్డి గెలుస్తారని.. అదే విధంగా బోధ్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధి జాదవ్ అనిల్ కుమార్ విజయం సాధిస్తారని లగడపాటి చెప్పారు. తెలంగాణ లో 119 నియోజకవర్గాల్లో దాదాపు 8 నుండి 10 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధు లే గెలుస్తారని లగడపాటి తేల్చేసారు. దీంతో.. నువ్వా -నేనా అన్నట్లుగా సాగుతున్న తెలంగాణ సమరంలో రెండు ప్రధాన పార్టీలు- కూటమిలకు లగడపాటి చెప్పినట్లుగా స్వతంత్రులు ఈ స్థాయిలో గెలిస్తే..ఖచ్చితంగా వీరే తెలంగాణ నూతన ప్రభుత్వంలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. రోజుకు రెండు నియోజకవర్గాల విజేతలను ప్రకటిస్తానని లగడపాటి చెప్పటంతో...ఉత్కంఠ మరింత పెరుగుతోంది.












Click it and Unblock the Notifications