• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీకి చేయూత ఇవ్వండి..సమర్ధత నిరూపిస్తాం: ముఖ్యమంత్రికి నీతి అయోగ్ ప్రశంసలు..చురకలు..!!

|

పేదల సంక్షేమం లక్ష్యంగా..మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చేయూతను అందిస్తే సమర్ధతను నిరూపించుకుంటామని ముఖ్యమంత్రి జగన్ నీతి అయోగ్ ను కోరారు. అమరావతి కి వచ్చిన నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మంత్రులు..అధికారులు శాఖల వారీగా ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరించారు. ముఖ్యమంత్రి తమ పాలనలో తీసుకున్న నిర్ణయాలను నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ కు విశ్లేషించారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అమ్మ ఒడి పధకానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పాన్సర్ చేస్తే దేశానికే రోల్ మోడల్ గా ఉంటుందని జగన్ కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలుసుకున్న రాజీవ్ కుమార్ ముఖ్యమంత్రి జగన్ ఆలోచన..విజన్..ప్రణాళికలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. అదే సమయంలో రెవిన్యూ లోటు ఆందోళన కరంగా ఉందన్నారు. బడ్జెటేతర ఖర్చులు ఎక్కువగా ఉందంటూ చురక అంటించారు. ఏపీకి సాధ్యమైనంత మేర సాయం అందిస్తామన్నారు.

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. దేవాలయ పదవుల్లోనూ రిజర్వేషన్లు..!!

అమ్మఒడికి స్పాన్సర్ చేయండి..రోల్ మోడల్ అవుతుంది..

నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశమైన సమయంలో కేంద్రం నుండి తాము ఏం ఆశిస్తుందీ నివేదిక ద్వారా జగన్ అందించారు. ఏపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం గురించి వివరించారు. వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో రాష్ట్రం బాధపడుతోందని ముఖ్యమంత్రి ఆయనకు నివేదించారు. గత ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను రూ. 2.27 లక్షలతో ప్రవేశ పెట్టిందని వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ అంతే ఉంచి అంతర్గతంగా కొన్నిమార్పులు చేసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తమకు వచ్చే ఆదాయంతో పాటుగా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులు గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే గ్రాంట్లు తగ్గకుండా చూడాలని సీఎం జగన్ కోరారు. ఏపీలో నిరక్ష రాస్యత అధిగమించేందుకు బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పిల్లలను బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహించటానికి ఏడాదికి రూ 15 వేలు ఇస్తున్నామని...వచ్చే జనవరిలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. విద్యా..వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని..ఆరోగ్య శ్రీ ని యూరివర్సల్ చేస్తున్నామని వివరించారు.

NITI Aayog vice chairman Rajiv Kumar assured Ap Govt for maximum support in all sectors

ముఖ్యమంత్రికి వైస్ ఛైర్మన్ ప్రశంసలు..చురకలు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు మంత్రులు..అధికారులు ఇచ్చిన వివరాలను నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆలోచన..విజన్..ప్రణాళికలు బాగున్నాయంటూ రాజీవ్ కుమార్ ప్రశంసించారు. అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల కాలంలోనే పని తీరు చూపారని అభినందించారు. తాము చేయగలిగినదంగా చేస్తామని..తగిన రీతిలో సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేసారు. అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందు ఉండేలా తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పారిశ్రామిక వాటా తక్కువగా ఉందని.. బడ్జెట్‌లో సగానికిపైగా మానవవనరుల వృద్ధికోసం ఖర్చుచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఏపీలో రెవిన్యూ లోటె ఆందోళన కరంగా ఉందని రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. బడ్జెయేతర ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయని చురకలు అంటించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్లనిర్మాణంపై దృష్టిపెట్టాలని సూచించారు. మహిళా, శిశుసంక్షేమంపై దృష్టిపెట్టాలని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. పప్పు దినుసులు, నూనెగింజల సాగును దేశవ్యాప్తంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నామని..వాటికి సరైన మద్దతు ధర ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని రాజీవ్ కుమార్ వివరించారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వచ్చిన సమయంలో తనతో చర్చించారని.. నవరత్నాల గురించి వివరించారని గుర్తు చేసారు. బియ్యం, వంటనూనెల్లో ఖనిజలవణాలు, విటమిన్లు ఉండేలా చూడాలంటూనే..దీనిపై కేంద్ర ఆహార శాఖతో కలిసి పనిచేస్తున్నామన్నారు. దీనికి అవసరమైన రీతిలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాజీవ్ కుమార్ సూచించారు.

English summary
NEETI Ayog vie chairman Rajeev Kumar assured Ap Govt for maximum support in all sectors. He appreciated Cm jagan vision in his administration. CM jagan requested him to support AP in all needs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X