పవన్ క్రేజ్ ఎన్టీఆర్‌ను గుర్తుచేసింది.. పృథ్వీ కామెంట్స్, సర్కార్ తీరుపై ప్రకాశ్ రాజ్ గుస్సా
భీమ్లా నాయక్ మూవీ హిట్ కాగా.. వివాదం మాత్రం కొనసాగుతోంది. ఏపీలో ఆంక్షలపై జనసేన, పవన్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. తాజాగా వారికి నటులు ప్రకాశ్ రాజ్, పృథ్వీ తోడయ్యారు. అయితే పృథ్వీ వైసీపీతో అనుబంధం ఉంది. ఎస్వీబీసీ చైర్మన్‌గా కూడా నియమించారు. కానీ వివాదం నేపథ్యంలో పోస్టంగ్ బూస్టింగ్ అయ్యింది. అప్పటినుంచి జగన్‌తో దూరంగా ఉంటూ వస్తూన్నారు. ఇప్పుడు పవన్‌కు అనుకూలంగా కామెంట్స్ చేశారు.

అపట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు పవన్
భీమ్లా నాయక్ మూవీ గురించి నటుడు పృథ్వీ రాజ్ హీరో పవన్ కల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తారు. తెలుగు ప్రజలకు, పవన్ ఫ్యాన్స్‌కు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. అప్పట్లో తాను సీనియర్ ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు సినిమా చూశానని అన్నారు. తన జీవితంలో ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఆ సినిమా చూడడానికి తాడేపల్లి గూడెంలోని విజయా టాకీస్‌కు వెళ్తే అక్కడకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారని గుర్తు చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ పవన్ కల్యాణ్‌కే ఉందని చెప్పారు.

రానా-పవన్ అదుర్స్
భీమ్లా నాయక్ సినిమా క్లైమాక్స్‌తోపాటు రానా-పవన్ కల్యాణ్ నటించిన సన్నివేశాలు చాలా బాగున్నాయని తెలిపారు. తాను కూడా ఓ ప్రేక్షకుడిలా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాని అన్నారు. ఇంత అద్భుతమైన సినిమాలో తాను నటించలేకపోయాననే బాధ ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు దిష్టి తగలకూడదని కోరుకుంటున్నానని అన్నారు.

అధిపత్య ధోరణి ఏందీ..?
ఇటు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. #BheemlaNayak, #GovtofAndhrapradesh హ్యాష్ ట్యాగ్ తో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సృజన సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, అధిపత్య ధోరణి ఏమిటీ ? అని ఆయన నిలదీశారు. చిత్ర పరిశ్రమను క్షోభ పెడుతూ మేమే ప్రోత్సాహిస్తున్నాం అంటే నమ్మలా ? అని ప్రశ్నించారు. ఏవైనా ఉంటే.. రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి.. కక్ష సాధింపులు బాక్సాపీస్ దగ్గర ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ఇబ్బంది పెట్టినా... ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

జగన్‌తో చిరు భేటీ
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, ఇతర నటులు సీఎం జగన్ కలిసి సినీ సమస్యలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఓ నివేదిక అందిన తర్వాత.. జీవో జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ఇండస్ట్రీ వారంతా సమన్వయం పాటించాలని చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్‌పై ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications