జగన్ జాతకం ఈడి దగ్గర ఉంది : జెడి పదేళ్ల క్రితమే బిగించేసారు: పవన్ నామినేషన్ దాఖలు
జనసేన అధినేత పవన్ కళ్యాన్ గాజువాక నుండి నామినేషన్ దాఖలు చేసారు. వైసిపి అధినేత జగన్ లక్ష్యంగా విమ ర్శలు చేసారు. జగన్ కేసుల గురించి ఆయన ప్రస్తావించారు. జగన్ ను జెడి లక్ష్మీనారాయన పదేళ్ల క్రితమే బిగించేసా రని పవన్ వ్యాఖ్యానించారు. ఇక, టిడిపి..వైసిపి ఎలాంటి అభ్యర్దులను నిలబెడితే తాను అటువంటి వారినే బరిలో దిం చుతున్నానని చెప్పుకొచ్చారు.
గాజువాక నియోజకవర్గానికి నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ (ఫొటోలు)
పవన్ నామినేషన్ దాఖలు
ఈ ఎన్నికల్లో జనసేన అధినేత వపన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అదే విధంగా విశాఖ జిల్లా గాజువాక నుండి పవన్ పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా గాజువాక నియోజకవ ర్గం నుండి పవన్ నామినేషన్ దాఖలు చేసారు. పవన్ తో పాటుగా విశాఖ జనసేన ఎంపి అభ్యర్ది జెడి లక్ష్మీనారాయణ ఉన్నారు. కాగా, నామినేషన్ సమర్పించేందుకు ముందు జనసేన పార్టీ శ్రేణులు మర్రిపాలెం నుంచి గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించాయి. శుక్రవారం సోదరుడు నాగబాబు తో కలిసి ఆయన భీమవరం ని యోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేస్తారు. నాగబాబు సైతం నర్సాపురం లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక, ఎన్నికల ప్రచార సభలు సైతం పవన్ ప్రారంభించారు.

సిబిఐ..జెడి చేతుల్లో జగన్ జాతకం..
వైసీపీ అధినేత జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విమర్శలు గుప్పించారు. జగన్.. జాతకం ఈడీ, సీబీఐ దగ్గర ఉందన్నారు. ఆయన దోపిడీనే చేస్తారా.. మనకు న్యాయం చేస్తారా అని పవన్ ప్రశ్నించారు. రాజకీయాల్లోకి మాస్ లీడ ర్లను తీసుకొస్తానని చెప్పారు. పక్క పార్టీల క్రిమినల్స్ మీద పడితే.. ఎదుర్కోడానికి జనసేనకు మాస్ లీడర్లు కావాలన్నా రు. జగన్, చంద్రబాబు మంచి అభ్యర్థుల్ని పెడితే.. తాను కూడా మంచి అభ్యర్థుల్నే నిలబెడతానని పేర్కొన్నారు.
ఏ ముఖం పెట్టుకుని వైసీపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ఇక, స్థానిక మంత్రి గంటా విశాఖ లో భూ కబ్జా లకు సహకరించారని ఆరోపించారు. తాను మార్పు కోసం పోరాటం చేస్తున్నానని..జనసేన ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పుఒకచ్చారు. గంటా చట్టసభల్లోకి రాకుండా ఓ మహిళ ను ఆయన పై పోటీకి పెట్టామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications