అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ‌రావ‌తిలో అందుబాటులో జ‌న‌సేనాని : ఇక ఎన్నిక‌ల బ‌రిలోకి..

|
Google Oneindia TeluguNews

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ చేసిన ట్వీట్ ఇప్పుడు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు..ప‌వ‌న్ అభిమానుల్లో జోష్ తీసుకొస్తోంది. ఈ సంక్రాంతి నుండి జ‌న‌సేన ఎన్నిక‌ల బ‌రిలోకి దూకే క్రాంతి స‌మ‌యం ఆరంభం కానుందని ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ఇక‌, అమ‌రావ‌తిలో అంద‌రికీ అందుబాటులో ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.

సూర్యుడు ఉత్త‌రాయ‌ణంలోకి వ‌చ్చే సంక్రాంతి నుండి జ‌న‌సేన ఎన్నిక‌ల బ‌రిలోకి దూకే క్రాంతి స‌మ‌యం ఆరంభం కానుంది. అందుకే జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుండి క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌తో పాటు ఇక నాయ‌కులంద‌రికీ అమ‌రావ‌తి లో అనుక్ష‌ణం అందుబాటు లో ఉంటా..అంటూ ప‌వ‌న్ క‌ళ్యాన్ ట్వీట్ చేసారు. దీని పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల నుండి పెద్ద ఎత్తు న స్పంద‌న వ‌స్తోంది. మీ వెంటే న‌డుస్తామంటూ అభిమానుల నుండి స్పంద‌న వ్య‌క్తం అయింది. జ‌న‌సేన ప్లీన‌రీ నుండి ప‌వ‌న్ త‌న రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ వేగ‌వంతం చేసారు. అందులో భాగంగా.. శ్రీకాకులం- ఉభ‌య గోదావ‌రి - అనంత‌పురం జిల్లాల్లో ప‌ర్య‌టించారు. క‌వాతులు నిర్వ‌హించారు. ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ...ప్ర‌తిప‌క్షాన్ని ప్ర‌శ్నిస్తూ వ‌ప‌న్ స‌భ‌లు సాగుతు న్నాయి. ఇప్ప‌టికే గోదావ‌రి జిల్లాల్లో పార్టీలో చేరిక‌లు మొద‌ల‌య్యాయి. గుంటూరు జిల్లా నేత‌లు పార్టీలో చేరారు. అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకొని వ‌చ్చిన ప‌వ‌న్‌..ఇక త‌న కార్యాచ‌ర‌ణ ఏంటో చెప్ప‌క‌నే చెప్పారు.

Pawan Kalyan stay in Amravati : ready for election fight...

అమ‌రావ‌తి లోనే ..ఎన్నిక‌ల బ‌రిలోకి..

ఏపి రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా ప‌వ‌న్ త‌న రాజ‌కీయాలు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం తాడేప‌ల్లి స‌మీపం లో జ‌న‌సేన కార్యాల‌యం..నివాసం సిద్దం చేసుకున్నారు. జ‌న‌వ‌రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేయా ల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించారు. రాష్ట్రంలో స‌మస్య‌లు ఉన్న ప్రాంతంలో ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి చివ‌ల్లో ఎన్నిక ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో..ఇక పార్టీలో చేరేవారిని అమరావ‌తిలోని పార్టీ కార్యాల‌యం వేదిక‌గా పార్టీలోకి ఆహ్వానించ‌నున్నారు. అదే విధంగా.. అన్ని జిల్లాల్లోనూ ప‌ర్య‌ట‌న‌ల‌కు వీలుగా కార్యా చ‌ర‌ణ ఖ‌రారు చేస్తున్నారు. అమ‌రావ‌తి వేదిక‌గా టిడిపి త‌మ వ్యూహాలు అమ‌లు చేస్తుండ‌గా.. వైసిపి సైతం కొంత కాలంగా అక్క‌డి నుండే త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తోంది. తాజాగా, జ‌న‌సేన సైతం అమ‌రావ‌తినే వేదిక‌గా ఖ‌రారు చేసుకోవ‌టంత తో ఇక ఏపిలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం జ‌న‌వ‌రి నుండే వేడెక్క‌నుంది.

English summary
Janasena Chief Pawan Kalyan decided to stay in Amaravati. He appealed party cadre to join in party active politics form January.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X