• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'జబర్దస్త్'కు మరో రెండున్నరేళ్లు ఢోకాలేదు! రోజా కోరుకుంది... జగన్ ఇచ్చారు!

|

అమరావతి/హైదరాబాద్ : అనుకున్న విధంగానే నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు ముఖ్యమైన పదవి దక్కింది. మొదట మంత్రి పదవుల్లో తన పేరు లేకపోవడంపై అందరూ ఆశ్చర్యపోయారు. కానీ రోజాకు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ అధినేత జగన్ నియమించారు. తనను ఈ పదవిలో నియమించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ రోజా తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు కూడా. అయితే రోజాకు నామమాత్రపు పదవి కేటాయించి మరో రెండున్నరేళ్లు జబర్దస్త్ కార్యక్రమంలో కొనపాగేందుకు సీఎం వెసులుబాటు కల్పించినట్టు అమరావతిలో చర్చ జరుగుతోంది.

రోజాకు నామమాత్రపు పదవి..! మరో రెండున్నరేళ్లు జబర్దస్త్ లోనే..!!

రోజాకు నామమాత్రపు పదవి..! మరో రెండున్నరేళ్లు జబర్దస్త్ లోనే..!!

జగన్ మంత్రివర్గ ఏర్పాటు రోజు నుంచి ముభావంగా ఉన్న రోజా... జగన్ ఇచ్చిన హామీతో వికసించారు. మంత్రి పదవి దక్కకపోవడంతో చెలరేగిన అసమ్మతి అంతా ఇంతా కాదు. చంద్రబాబుపై ముఖాముఖి తెగించి పోరాడి, ఐదేళ్లపాటు అష్టకష్టాలు పడ్డ రోజాకు మంత్రి పదవి ఇవ్వలేదన్న బాధ ఆమె అభిమానులను, నగరి నియోజకవర్గ వైసీపీ శ్రేణులను నిరాశపరిచింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా రోజాకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండేది అని ట్వీట్ లో కోరారు. దీంతో రోజాపై సానుభూతి పెల్లుబికింది. ఈ నేపథ్యంలో, రోజాకు కీలకమైన పదవిని కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతున్నా దానికి అంత ప్రధాన్యత లేదనే చర్చ మొదలైంది.

జ‌గ‌న్‌కు విజ‌య‌శాంతి..నారాయ‌ణ ప్ర‌శంస‌లు: అలా చేసినా

మంత్రి వర్గంలో చోటు దక్కని రోజా.. నామినేటెడ్ పోస్ట్ తో అసంతృప్తి..

మంత్రి వర్గంలో చోటు దక్కని రోజా.. నామినేటెడ్ పోస్ట్ తో అసంతృప్తి..

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్ పర్సన్ గా రోజాను నియమించారు ఏపి సీఎం జగన్. రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆమె మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొనకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆమె అలకబూనారని వార్తలు వచ్చాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో జగన్ ఆదేశాలతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆమెతో మాట్లాడినట్టు చర్చ చరిగింది. ఆ తర్వాత జగన్ నేరుగా రోజాతో మాట్లాడారు. ఆర్టీసీ చైర్ పర్సన్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఆఫర్ చేసినట్టుగా వార్తలొచ్చాయి. చివరకు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవికి రోజా ఓకే అన్నారని తెలిసింది.

నివురు గప్పిన నిప్పులా అసహనం..! మరి కొంత కాలం వేచి చూసే ధోరణిలో రోజా..!!

నివురు గప్పిన నిప్పులా అసహనం..! మరి కొంత కాలం వేచి చూసే ధోరణిలో రోజా..!!

వైసీపీలో మొట్టమొదటిసారిగా అసంతృప్తి జ్వాల చెలరేగింది. ఏపీ మంత్రివర్గంలో చోటు ఖాయమనుకున్న ఎమ్మెల్యేలు రోజా అలిగారు. సీఎం జగన్ రెడ్డి సామాజిక వర్గ మైన రోజాకీ సామాజిక కోణంలో మంత్రి పదవులు దక్కలేదు. మంత్రి పదవులపై ఎంతగానో ఆశలు పెట్టుకున్న రోజా, తమను జగన్ పక్కనపెట్టడంతో అవాక్కయారు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నారట. తన ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారట. మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రోజా వెళ్లలేదు. ఆమె అప్పటి నుంచి వైసీపీ అధిష్టానానికి ఫోన్ లో కూడా అందుబాబులో లేరని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

వైసీపీలో ఫైర్ బ్రాండ్..! రెండున్నరేళ్ల తర్వాతే వినిపించనున్న రోజా గళం..!!

వైసీపీలో ఫైర్ బ్రాండ్..! రెండున్నరేళ్ల తర్వాతే వినిపించనున్న రోజా గళం..!!

ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా బాద్యతలు చేపట్టిన రోజాకు రాబోవు రెండున్నరేళ్లు జబర్ధస్త్ కార్యక్రమంలో కొనసాగేందుకు వీలు చిక్కినట్టు తెలుస్తోంది. నామమాత్రపు ఏపిఐసీసీ ఛైర్ పర్సన్ పదవి లో రెండున్నరేళ్లు కొనసాగిన తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు జబర్ధస్త్ లో జడ్జ్ గా కొనసాగే వెసులుబాటు జగన్ కల్పించినట్టు అమరావతిలో చర్చ జరుగోతంది. రెండున్నరేళ్ల తర్వాత క్యాబినెట్ రీ-షఫుల్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు రోజా టీవీ కార్యక్రమాలు యధావిధిగా నిర్వహించుకోవచ్చని రోజా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Roja also posted on her Facebook page that she was grateful for her appointment as apiic chair person.However, there is debate in the Amravati that the Chair person convened to give Rosa a nominal job and countinue another two-and-a-half years at the Jabardad program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more