ఏపీలో కాస్త పెరిగిన కేసులు.. 2 వేల లోపు రోజువారీ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగినా.. రోజువారీ కేసులు 2 వేల లోపు వచ్చాయి. గత 24 గంటల్లో 1,891 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. కరోనాతో మరో ఐదుగురు చనిపోయారు. అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. కరోనా వైరస్ నుంచి నిన్న 10 వేల 241 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 54 వేల 40 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 26 వేల 236 మందికి కరోనా పరీక్షలు చేశారు.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,06,943కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,38,226గా ఉంది. కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 14,677కి చేరింది. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 440 కేసులు వచ్చాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 21 కేసులు వచ్చాయి.

1891 coronacases found at andhra pradesh and 5 people died in last 24 hours.

మరోవైపు దేశంలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. భారత్‌కు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికి అనుగుణంగా రోజువారి పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. జనవరి మధ్యలో అత్యధిక కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు క్రమంగా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న 80 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తే.. ఇవాళ ఆ సంఖ్య 70 వేల దిగువకు పడిపోయింది. ఇదే సమయంలో.. మృతుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగించే విషయం.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 67వేల 597 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. కోవిడ్ మృతుల సంఖ్య వెయ్యికి పైగా వచ్చింది. 1,188 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 9,94,891 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రోజువారి పాజిటివిటీ రేటు 5.02 శాతానికి దిగివచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+