• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రపంచ ఆర్దిక వేదిక పై సన్ రైజ్ స్టేట్..! దావోస్ వార్షిక సమావేశాలకు లోకేష్..!!

|

అయ‌రావతి/హ‌ఐద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలలో పాల్గొనేందుకు ఐటీ, పంచయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ దావోస్ వెళుతున్నారు. ఈ నెల 21న హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధుల బృందానికి మంత్రి లోకేష్ నాయకత్వం వహించనున్నారు. సన్రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వ‌ర‌ల్డ్ ఎక‌నామిక‌ల్ ఫోరం) వార్షిక సమావేశాలు స్విడ్జర్లాండ్లోని దావోస్లో జరగనున్నాయి.

21న దావోస్ పర్యటనకు మంత్రి నారా లోకేష్..! 23-24 న ప్ర‌పంగాలు..!!

21న దావోస్ పర్యటనకు మంత్రి నారా లోకేష్..! 23-24 న ప్ర‌పంగాలు..!!

ప్రపంచవ్యాప్తంగా ��న్న అత్యంత సంపన్న, శక్తివంతమైన దేశాలకు చెందిన ప్రభుత్వనేతలు, పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు, ప్రఖ్యాత కంపెనీల నిర్వాహకులు, ఆర్థికవేత్తలు పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకు ఏర్పాటు చేసినదే ప్రపంచ ఆర్థిక వేదిక. తమ దేశాలు, ప్రాంతాల అభివృద్ధి కోసం హాజరైన ప్రతినిధులు ఈ వేదికలో చర్చిస్తారు. పెట్టుబడులు, టెక్నాలజీ, భవిష్యత్ వాణిజ్యం, ప్రజల అవసరాల వంటి వాటిపై కీలక ప్రసంగాలుంటాయి. పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక, అంతర్జాతీయ సంబంధాలు బలపడేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక వేదికగా ఉపయోగపడుతోంది. వివిధ దేశాల నుంచి వందకు పైగా ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రపంచం నలుమూలల నుంచి వెయ్యికి పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు దావోస్ సదస్సుకు హాజరు అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందానికి నా���కత్వం..! యువ మంత్రిగా లోకేష్ ఎంట్రీ..!!

ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందానికి నా���కత్వం..! యువ మంత్రిగా లోకేష్ ఎంట్రీ..!!

మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి బృందం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డెలాయిట్, ప్రోక్టర్ అండ్ గేంబల్, విప్రో, పెగా సిస్టమ్స్, ఆర్సెలార్ మిట్టల్, నెస్లే, ఏటీ అండ్ టి , ఇన్వెస్కో కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనువైన పరిస్థితులను వివరించి వారిని ఒప్పించి ర��్పించేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రంగా కృషి చేయనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, ఇస్తున్న రాయితీలు ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో కీలక అంశాలపై ప్రసంగం..! అంద‌రి ద్రుష్టి ఆయ‌న‌పైనే..!!

వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో కీలక అంశాలపై ప్రసంగం..! అంద‌రి ద్రుష్టి ఆయ‌న‌పైనే..!!

ముఖ్యమంత్రి నారా చంద్��బాబు దావోస్ పర్యటనకు వెళ్లాలనుకున్నారు. అయితే గణతంత్ర వేడుకలు..ఇతర సమావేశాల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తన గైర్హాజరులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించే కీలక బాధ్యతలు ఐటీ, ఎలక్ర్టానిక్స్, పంచాయతీరాజ్ వంటి కీలకశాఖలు చూస్తోన్న మంత్రి నారా లోకేష్కి అప్పగించారు.సీఎం లోకేష్నే ఎంపిక చేయడం వెనుక చాలా కారణాలున్నాయి.

ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యం..! ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో భేటీ..!!

ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యం..! ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో భేటీ..!!

ప్రపంచ ఆర్థిక వేదిక కాంగ్రెస్ సెంటర్లో జరగనున్న కీలక అంశాలపై మంత్రి లోకేష్ ప్రసంగించనున్నారు. 23వ తేదీన ఎజైల్ గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్, ఇండియా 4.0 అంశాలపై నారా లోకేష్ కీలకోపన్యాసం చేయనున్నారు. 24వ తేదీన సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాలపై మాట్లాడనున్నారు. దావోస్ పర్యటనలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ రంగం ప్రభుత్వ సలహాదారుడు టీ.విజయ కుమార్, ఇంధనం, మౌలిక, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణకిషోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోక్యరాజ్, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్ బాబు, సమాచార శాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు, వైద్య శాఖ సలహాదారుడు డాక్టర్ జితేందర్ శర్మ,ఐట�� ఓఎస్డి కిరణ్ గుత్తా,ఐటి జిఎం శ్రీనివాస్ పాల్గొననున్నారు

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With the instructions Andhra Pradesh Chief Minister Chandrababu, IT and Panchayati Raja Minister Nara Lokesh will be attending the annual meeting of the World Economic Forum in Davos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more