అధికార వికేంద్రీకరణ కాదు...అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి... చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై మరోసారి విరుచుపడ్డారు. రాష్ట్రంలో ఎవరేం చేయాలన్న జే టాక్స్ కట్టాలంటూ... ఆయన ఆరోపణలు చేశారు. ఈనేపథ్యంలోనే మద్యం ధరలు పెంచారని అన్నారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా... న్యాయం పాండవుల వైపే ఉంటుందని అన్నారు. తామంతా పాండవులమనే సంకేతాలు ఇచ్చారు. తనపై సీఎం తెలివితేటలు ఉపయోగిస్తే... ఆయనకే నష్టమని హితవు పలికారు.

అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి
సీఎం జగన్ రాష్ట్ర రాజధానిపై ప్రకటన చేసిన నేపథ్యంలోనే ఆయన మరోసారి దానిపై స్పందించారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎలాంటీ ప్రయోజం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి గాని, పరిపాలన వికేంద్రీకరణ జరగడం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు. ప్రస్తుతం ఉన్న శాసన సభ మయసభగా మారిందిని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇక వైసీపి విధానాల వల్ల రాష్ట్ర అర్థిక పరిస్థితి తిరోగమన దిశలో పయనిస్తుందని అన్నారు. పరిశ్రమలన్ని వెళ్లిపోయాయని అన్నారు. విశాఖకు డాటా సెంటర్‌కూడ రానీయకుండా చేశారని అన్నారు. రాష్ట్రానికి అదాయం పెరగాలని, అప్పుడే ఉద్యోగాలు పెరుగుతాయని అన్నారు.

చిన్న పోరపాట్ల వల్ల అధికారం కోల్పోయాం
అనంతపురం టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అభివృద్ది కోసం తాను ఎంతో కష్టపడ్డానని చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చానని అన్నారు. కార్యకర్తలు కూడ ఎంతో కష్టపడ్డారని , పార్టీ కోసం సర్వం త్యాగం చేశారని తెలిపారు. అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. మరోవైపు జగన్ ఎన్నికల సమయంలో ఎన్నో అబద్దాలు చెప్పారని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం వల్లే వైసీపీకి అధికారం కట్టబెట్టారని చంద్రబాబు అన్నారు.

రాయలసీమను అభివృద్ది చేశాను..
ఇక అనంతపురం జిల్లాకు కియా మోటారును తీసుకువచ్చానని ,దీని వల్ల ప్రత్యక్షంగా 12వేల మందికి, పరోక్షంగా 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయని వివరించారు. ఇందుకోసం ఆరునెలల్లో గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కీయా మోటార్స్‌కు నీళ్లు ఇచ్చామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెదేపా కార్యకర్తలను హత్య చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 640 మంది తెదేపా నేతలపై కేసులు పెట్టారని.. పలువురిపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications