జలగల్లా జనాన్ని పీల్చుకుంటారా.. డబ్ల్యుహెచ్‌వో ఏం చెప్పింది, జగన్‌పై లోకేశ్ గుస్సా

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని నిప్పులు చెరిగారు. వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదని కడిగిపారేశారు. రెమిడెసివర్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. స్వార్థం మాని ప్రజా సంక్షేమం పట్టించుకోవాలని కోరారు. ఇకనైనా సుపరిపాలన చేయాలని హితవు పలికారు.

మీ బంధువు కంపెనీ కదా

మీ బంధువు కంపెనీ కదా

సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నలు సంధించారు. మీ బంధువు కంపెనీ తయారు చేసే రెమ్‌డెసివిర్‌ని బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతూ జనాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని ఫైరయ్యారు. కరోనా చికిత్సకు పనికిరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన.. రెమ్‌డెసివిర్‌ పేరుతో కోట్లు కొల్లగొట్టారని విరుచుకుపడ్డారు. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి.. ఇలా దోచుకోవడం ఏంటీ అని ఫైరయ్యారు.

అందుకే భయం భయం

అందుకే భయం భయం

సీబీఐ, ఈడీ కేసుల భయంతో ప్రధాని మోడీని వ్యాక్సిన్ కోటా అడగడం లేదని లోకేశ్ చెప్పారు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏడుపులు అని గుర్తుచేశారు. వ్యాక్సిన్‌కి డబ్బు ఇవ్వకుండా కొవాగ్జిన్ చంద్రబాబు బంధువులదని చెప్పడం సరికాదన్నారు. మరీ కొవిషీల్డ్‌ కొనుగోలుకి చంద్రబాబు అడ్డు పడ్డారా అని అడిగారు. 2 కంపెనీలు కమీషన్ ఇవ్వను అన్నాయా అని ప్రశ్నించారు. మీ బంధువుల కంపెనీ.. వ్యాక్సిన్ తయారుచేసే వరకూ ప్రజల్ని ఇలానే చంపేస్తావా అని లోకేష్‌ ప్రశ్నించారు.

Recommended Video

    Long COVID ఓసారి తగ్గాక మళ్లీ ?| 6-12 Months After First Infection మళ్లీ వైరస్ దాడి| Oneindia Telugu
    టీకా తప్పనిసరి

    టీకా తప్పనిసరి

    ప్రజారోగ్యం మీకు పట్టదా అని అడిగారు. ఎప్పుడూ సంపాదనపై దృష్టి పెడతారని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని హితవు పలికారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీకా తీసుకోవడం తప్పనిసరి అవుతోందని చెప్పారు. ఎలర్జీ సమస్య ఉంటే తప్ప మిగతా వారందరూ టీకా తీసుకోవాలని సజెస్ట్ చేశారు. కానీ రాష్ట్రంలో టీకాల స్టాక్ లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+