Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కు షాక్ ఇచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోమారు తేల్చేసిన కేంద్రం .. నెక్స్ట్ ఏంటి ?

ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టి పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారనే భావన ఏపీ ప్రజల్లో ఉంది. అధికారంలోకి వచ్చే ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది కూడా ప్రత్యేక హోదానే . ఎలాగైనా ఏపీకి హోదా సాధించి తీరుతామని, అది కేవలం వైసీపీ వలనే సాధ్యమని వైకాపా నేతలు ఎన్నికల ముందు గట్టిగా చెప్పారు . జనం సైతం వారి మాటల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కానీ గెలిచిన మరునాడే కేంద్రానికి సంపూర్ణ బలం ఉంది కాబట్టి గట్టిగా అడగలేమన్న చందంగా జగన్ వ్యాఖ్యలు చేశారు .బీజేపీకి ఇన్ని సీట్లు రాకుండా ఉండాల్సింది అని ఆయన వ్యాఖ్యలు చేశారు . కానీ ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. దానికోసం ప్రయత్నం చేస్తున్న జగన్ కు కేంద్రం షాక్ ఇచ్చింది.

Recommended Video

    జావేదికను కూల్చివేయాలని ఆదేశించిన సీఎం జగన్
    జగన్ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం ...ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం ..

    జగన్ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం ...ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం ..

    నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి కేంద్రానికి నివేదిక ఇచ్చారు . తన వాదన బలంగా వినిపించారు. ఇక తాజాగా ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా జగన్ హోదా గురించి కేంద్రానికి గుర్తుచేశారు. కానీ స్పందన లేదు. అయితే హోదా ఇవ్వకూడదని కేంద్రం ఎంత బలంగా నిర్ణయించుకుందో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాటల్లో తేటతెల్లమైంది. నిన్న లోక్ సభలో మాట్లాడిన ఆమె ఆంధ్రతో పాటుగా తెలంగాణ, ఒడిసా, రాజస్థాన్‌, బిహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచీ ప్రత్యేక హోదా డిమాండ్లు వచ్చాయి. కానీ, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేవు అన్నారు.

     జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం .. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట ఎలా ?

    జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం .. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట ఎలా ?

    దీంతో ఏపీ ప్రజలకు, సీఎం జగన్ కు షాక్ తగిలింది. కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీని ఒప్పించి ఎలాగైనా ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమాతో ఉన్న జగన్ కు పాలన ప్రారంభించిన తొలినాళ్ళలోనే బీజేపీ షాక్ ఇచ్చింది. ప్రత్యేక హోదా రాదని తేల్చేసింది. ఇప్పుడు ప్రజా ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఏం చెయ్యబోతున్నారు. మరి నిర్మలా సీతారామన్ మాటలకు జగన్ ఎలా స్పందిస్తారు అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు . ఇప్పుడు ఆయన చెప్పబోయే మాటలే హోదాపై వారి చిత్తశుద్ధి ఎంతటిదో స్పష్టం చేస్తుందని అందరూ భావిస్తున్నారు.

     నెక్స్ట్ ఏంటి .. జగన్ పోరాడతారా .. ఏం చేస్తారు

    నెక్స్ట్ ఏంటి .. జగన్ పోరాడతారా .. ఏం చేస్తారు

    ఇక ఈ విషయంలో జగన్ కూడా సందిగ్ధంలో పడ్డారు. కేంద్రంతో సఖ్యంగా వుంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చెయ్యాలని జగన్ భావించారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్న చందంగా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చేసింది. ఇక షాక్ నుండి జగన్ తేరుకుని ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తారు. చంద్రబాబులాగా పోరాటం చేసి దెబ్బ తింటారా .. లేకా వ్యూహాత్మకంగా ఎలాంటి స్టెప్ తీసుకుంటారా ... నెక్స్ట్ ఏంటి అంటున్నారు ఏపీ ప్రజలు

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+