• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పోస్టింగుల ఊసు లేదు.. ఏపీలో 30 మంది డిఎస్పీలు బదిలీ.. ఇలా ఇదే తొలిసారా?

|

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున డీఎస్పీలను బదిలీ చేశారు. ఏకకాలంలో 30 మంది డీఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేయడం చర్చానీయాంశమైంది. అయితే వారందరికి పోస్టింగులు ఇవ్వలేదని తెలుస్తోంది. 30 మందిని కూడా హెడ్ క్వార్టర్స్‌కి బదిలీ చేసినట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా డీఎస్పీల బదిలీల పట్ల ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కేంద్రంలో పవర్‌ఫుల్.. ఏపీలో బలపడే ప్రయత్నం.. మరి తెలంగాణలో బీజేపీ ఫెయిల్యూరా?కేంద్రంలో పవర్‌ఫుల్.. ఏపీలో బలపడే ప్రయత్నం.. మరి తెలంగాణలో బీజేపీ ఫెయిల్యూరా?

బదిలీలు ఓకే.. మరి పోస్టింగులు..!

బదిలీలు ఓకే.. మరి పోస్టింగులు..!

ఏపీలో 30 మంది డిఎస్పీలను ఒకేసారి ట్రాన్స్‌ఫర్ చేస్తూ.. వారిని మంగళగిరిలోని హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముప్పై మందే కాకుండా రెండు మూడు రోజుల్లో భారీ బదిలీలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా బదిలీ అయినవారిలో కొంతమంది ఆయా జిల్లాలకు ఎన్నికల వేళ ట్రాన్స్‌ఫర్ అయినవారు ఉన్నారు. మరికొందరేమో టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరి నేతల వత్తిడితో తమకు అనుకూలంగా బదిలీ అయినవారు ఉన్నారు. ఇందులో కొందరిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నట్లు సమాచారం.

బదిలీ అయిన డీస్పీలు వీరే :

బదిలీ అయిన డీస్పీలు వీరే :


బి.శ్రీనివాసులు SDPO, కర్నూల్
బాబు ప్రసాద్ SDPO, గూడూరు
మురళి కృష్ణ SDPO, నెల్లూరు టౌన్
ఎన్.టి.వి. రామ్ కుమార్ ఎస్.బి డిఎస్పీ, అనంతపురం
ఎన్.యుగేంద్ర బాబు SDPO, పలమనేరు
ఎన్.వి.ఆర్ ఆంజనేయులు SDPO, చిత్తూరు
పి.వి.ఎస్.ఎస్.ఎం.వి.అర్.వర్మ SDPO, కాకినాడ
జి.రామ ఆంజనేయులు డిఎస్పీ ఎస్‌బి, గుంటూరుఅర్బన్
కె. శ్రీనివాసరావు SDPO, ప్రొద్దుటూరు
ఎస్.వి.వి.ప్రసాదరావు SDPO, అనకాపల్లి
ఏ.వి.ఎల్.ప్రసన్న కుమార్ ఏసీపీ, వైజాగ్ నార్త్
జి.పూర్ణ చంద్రరావు ఏసీపీ, వైజాగ్ ఈస్ట్
బి.ప్రసాదరావు SDPO, కాశీబుగ్గ
సిహెచ్.వి.రామరావు SDPO, పెద్దాపురం
మహేష్ SDPO, గుడివాడ
వి.పోతురాజు SDPO, అవనిగడ్డ
బి.శ్రీనివాసరావు SDPO, నూజివీడు
వై.బి.పి.టి.ఏ.ప్రసాద్ ఏసీపీ, విజయవాడ సెంట్రల్
ఎన్.మురళి కృష్ణ డిఎస్పీ ఎస్‌బి, పశ్చిమ గోదావరి
వి.కాలేషావలి SDPO, సత్తెనపల్లి
జి.రామకృష్ణ డిఎస్పీ, గుంటూరు నార్త్
యు.నాగరాజ్ SDPO, చీరాల
ఏ.ఎస్.సి.బోస్ SDPO, నందిగామ
ఎన్.రామారావు డిఎస్పీ, రాజముండ్రి సెంట్రల్
విక్రమ్ శ్రీనివాస్ రావు డిఎస్పీ ఇంటెలిజన్స్, ఒంగోలు
డి.అమర్నాథ్ నాయుడు డిఎస్పీ ఇంటెలిజన్స్
ఎం.శ్రీనివాస్ రావు డిఎస్పీ, ఏపిఎస్‌పి
జె .మల్లికార్జున వర్మ డిఎస్పీ ఇంటెలిజన్స్, కడప
బి.విజయ్ భాస్కర్ డిఎస్పీ, ఇంటెలిజన్స్
డి.శ్రవణ్ కుమార్ డిఎస్పీ ఇంటెలిజన్స్, కృష్ణ
ఐపీఎస్‌ల బదిలీలు కూడా భారీగానే.. 15 రోజుల్లో ఎంతమందంటే..!

ఐపీఎస్‌ల బదిలీలు కూడా భారీగానే.. 15 రోజుల్లో ఎంతమందంటే..!

ఈనెల 22న కూడా భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేశారు. 21 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగింది. 5వ తేదీన కూడా 26 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలా దాదాపు 15 రోజుల వ్యవధిలో 47 మంది ఐపీఎలను బదిలీ చేయడం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజుల్లోనే ఐపీఎస్‌లు టార్గెట్‌గా ట్రాన్స్‌ఫర్స్ జరగడం చర్చానీయాంశమైంది.

ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్.. ఐదేళ్లు నో పర్మిషన్!.. నీటి కష్టాలే కారణమా?ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్.. ఐదేళ్లు నో పర్మిషన్!.. నీటి కష్టాలే కారణమా?

సమూల ప్రక్షాళన.. లేదంటే..!

సమూల ప్రక్షాళన.. లేదంటే..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. పోలీస్ శాఖ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో మొన్నటివరకు ఐపీఎలను భారీగా బదిలీలు చేయడమే గాకుండా.. తాజాగా 30 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ వారిని హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసాధికారులు వైసీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారనే కారణంతో ఈ ప్రక్షాళన జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ జంబో బదిలీలు ఏపీలోనే గాకుండా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తుండటం విశేషం.

English summary
Thirty DSP Officers Transferred In Andhra Pradesh and they were not alloted postings. This is the first time like this as DGP Ordered to attach them to Head Quarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X