డిజిపి తో స‌హా ఆ ముగ్గురినీ త‌ప్పించండి:ఒకే వ‌ర్గానికి పోస్టింగ్‌లు: బాబు 4 వేల కోట్లు సిద్దం చేసారు

ఏపిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లిసి ఫిర్యాదు చేసారు. ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌టానికి ఇప్ప‌టికే నాలుగు వేల కోట్లు జిల్లాల‌కు పంపార‌ని ఫిర్యాదు చేసారు. ఓట్ల స‌ర్వే పేరుతో 59 ల‌క్ష‌ల దొంగ ఓట్ల‌ను చేర్చ‌టం..వైసిపి సానుభూతి ప‌రుల ఓట్ల‌ను తొలిగించటం చేస్తున్నార‌ని ఆధారాలు స‌మ‌ర్పించారు. డిజిపి తో ముగ్గ‌రు పోలీసు ఉన్న‌తాధికారుల‌ను త‌ప్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు.

59 ల‌క్ష‌ల దొంగ ఓట్లు..4 ల‌క్ష‌ల వైసిపి ఓట్లు తొలిగించారు..

59 ల‌క్ష‌ల దొంగ ఓట్లు..4 ల‌క్ష‌ల వైసిపి ఓట్లు తొలిగించారు..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌టం కోసం ఆధికారం అడ్డుపెట్టుకొని ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తున్నార‌ని ఏపి విప‌క్ష నేత‌..వైసిపి అధినేత జ‌గ‌న్ కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లిసి ఫిర్యాదు చేసారు. ఏపిలో స‌ర్వే పేరుతో ప్ర‌భు త్వంలోని వారి క‌నుసన్న‌ల్లో ఓట్ల తొలిగింపు జ‌రుగుతోంద‌ని ఫిర్యాదు చేసారు. ఏపిలో 52.67 ల‌క్ష‌ల డూప్లికేట్ ఓట్లు ఉంటే..అవి ఇప్పుడు 59.18 ల‌క్ష‌ల‌కు చేరాయ‌ని వివ‌రించారు. స‌ర్వేల పేరుతో వైసిపి సానుభూతి ప‌రులుగా గుర్తించిన వారివి 4 లక్ష‌ల ఓట్లు తొలిగించార‌ని ఆధారాల‌తో స‌హ సీఈసి దృష్టికి తీసుకెళ్లారు. ఏపి -తెలంగాణ‌లో రెండు చోట్ల ఓట్లు ఉన్న‌వారు ఇప్ప‌టికీ ఉన్నార‌ని..దీనిని దృష్టిలో ఉంచుకొని రెండు చోట్ల ఒకేసారి ఎన్నిక‌లు పెట్టాల‌ని కోరారు. ప్ర‌భు త్వం ప్ర‌జాసాధికారిక స‌ర్వే..రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్..ప‌రిష్కార వేదిక పేరుతో డేటా క‌లెక్ట్ చేసి ఓట‌ర్ల‌ను తొలిగిస్తున్నార ని ఫిర్యాదు చేసారు.

ఆ ముగ్గురు అధికారుల‌ను త‌ప్పించండి..

ఆ ముగ్గురు అధికారుల‌ను త‌ప్పించండి..

ఏపి ముఖ్య‌మంత్రికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్న డిజిపి ఠాకూర్ తో పాటుగా ఇంట‌లిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వేంక‌టే శ్వ‌ర‌రావు, అదే విధంగా కొత్త‌గా లా అండ్ ఆర్డ‌ర్ కో ఆర్డినేష‌న్ అధికారిగా పోస్టు సృష్టించి నియ‌మించిన ఘ‌ట్ట‌మ‌నేని శ్రీనివాస్ ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పించాల‌ని అప్పుడే ఏపిలో ఎన్నిక‌లు స‌జావుగా జ‌రుగుతాయ‌ని జ‌గ‌న్ సీఈసికి వివ‌రించారు. అదే విధంగా ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌భుత్వం 37 మందికి డీఎస్పీలుగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తే అందులో 35 మంది ఒకే వ‌ర్గానికి చెందిన వార‌ని..వారంతా చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన వారేన‌ని వివ‌రించారు. పోలీసు వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేయ‌టానికి ఈ రకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీఈసి దృష్టికి జ‌గ‌న్ తీసుకెళ్లారు. ఇదే డిజిపి త‌న పై హ‌త్యా య‌త్నం జ‌రిగిన స‌మ‌యంలో గంట‌లోగా స్పందించి ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని జ‌గ‌న్ గుర్తు చేసారు.

నాలుగు వేల కోట్లు సిద్దం చేసారు..

నాలుగు వేల కోట్లు సిద్దం చేసారు..

ఎన్నిక‌ల కోసం ముఖ్య‌మంత్రి చంద్రబాబు తాను సంపాదించిన అక్ర‌మ సొమ్ము నుండి నాలుగు వేల కోట్లు ఇప్ప‌టికే జిల్లాల‌కు ఎన్నిక‌ల కోసం పంపార‌ని జ‌గ‌న్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల‌కు డ‌బ్బుల చేర‌వేత‌కు పోలీ సుల‌నే వాడుకుంటున్నార‌ని ఆరోపించారు. ఇక‌, ఇవియం ల‌పై ముఖ్య‌మంత్రి చేస్తున్న ఆరోప‌ణ‌ల పై జ‌గ‌న్ స్పందిం చారు. 2014 ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి ఇవియం ల‌ను టాంప‌రింగ్ చేసి గెలుపొందారా అని ప్ర‌శ్నించారు. అదే విధంగా కొద్ది రోజుల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మాడు చోట్ల గెలుపొందింద‌ని అక్క‌డ ఇవియం ల‌ను మేనేజ్ చేసారా అని ప్ర‌శ్నించారు. ఓడిపోతున్నామ‌ని తెలిసి సాకులు వెత‌క్కుంటున్నార‌ని జ‌గ‌న్ ఎద్దేవా చేసారు. త‌మ ఫిర్యాదుల పై సీఈసి సానుకూలంగా స్పందిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+