అమరావతిలో అమానుషం : ప్రేమ జంటపై దాడి : యువతి పై అత్యాచారం -హత్య..
ఏపి రాజధాని అమరావతి పరిధిలో అమానుషం చోటు చేసుకుంది. ప్రేమ జంట పై దాడి జరిగింది. యువతి పై ప్రియు డి ముందే అత్యాచారానికి తెగబడ్డారు. అడ్డుపడిన యువకుడి పై రాడ్డుతో దాడి చేసారు. యువతి పై లైంగిక దాడి చేసి ఆ తరువాత హత్య చేసారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది.
యవతి అమానుష హత్య..
ఏపి నూతన రాజధాని అయిన అమరావతి పరిధిలోని మంగళగిరి మండలం నవులూరు గ్రామంలోని అమరావతి స్టేడి యంలో ఘోరం చోటు చేసుకుంది. తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతి కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాసరావు బీసీ కులానికి చెందిన యువకుడు కాగా.. ఎం.ఫార్మసీ చదు వుకున్న జ్యోతి ఎస్టీ యువతి.

సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళ్లొస్తానని చెప్పి సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బ యల్దేరిన జ్యోతి.. శ్రీనివాసరావుతో కలిసి ఇద్దరూ రాత్రి అమరావతి స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ వారిపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు. శ్రీనివాసరావును రాడ్డుతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. యువతిపై లైంగిక దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమెను అమానుషంగా హత్య చేశారు.
దాడి పై అనుమానాలు...
బాధితులు ఇద్దరు తమ పై జరిగిన దాడితో కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న వారు విని పోలీసులకు సమాచారమి చ్చారు. మంగళగిరి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసరావును చినకాకాని ఆసుపత్రికి తరలించా రు. మంగళగిరి నార్త్ జోన్ డీఎస్సీ మాట్లాడుతూ.. దుండగులు దాడిచేయడంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందిందని , శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

నిందితులను గుర్తించేందు కు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎవరు చేసిన పని..అత్యాచారం చేసి హత్య చేయటంతో ఇందులో స్థానికులు ఉన్నారా..ఎవరైనా ఇతర ప్రాంతాలకు చెందిన వారా అనే కోణంలో విచారణ ప్రారంభించారు.
-
మండే ఎండల వేళ భారీ వర్షాలు, ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications