పొట్లూరి..తోట..మాగుంట..రాజా రవీంద్ర : నేడు వైసిపి లో కీలక చేరికలు : ఈ రోజే తొలి జాబితా..!
ఎన్నికల వేళ..వైసిపి అధికారిక తొలి జాబితా ఈ రోజు ఉదయం 10.20 గంటలకు విడదుల కానుంది. ఇక, ఈరోజు లోటస్ పాండ్ లో కీలక నేతలు వైసిపి లో చేరనున్నారు. టిడిపి నేతలతో పాటుగా పారిశ్రామిక..సినీ రంగ ప్రముఖులు ఈ రోజు జగన్ సమక్షంలో వైసిపి లో చేరుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల జాబితా మూడు విడతల్లో విడుదల చేయాల ని వైసిపి నిర్ణయించింది.

ఈ రోజు వైసిపి లోకి కీలక నేతలు..
వైసిపి లోకి విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వర ప్రసాద్ వైసిపి లో చేరుతున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా బరిలో దిగనున్నారు. ఆయన కొద్ది కాలం కిత్రం వరకూ పవన్ కళ్యాన్ తో సన్నిహితంగా ఉండే వారు. ఇక, సీనియర్ రాజకీయ నేత..ప్రస్తుత టిడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం వైసిపి లో ఈ రోజు అధికారికంగా చేరుతున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇక, కాకినాడ సిట్టింగ్ ఎంపి తోట నర్సింహం తన కుటుంబ సభ్యులతో కలిసి వైసిపిలో చేరుతున్నారు. తోట నర్సింహం సతీమణి వాణి వైసిపి నుండి పెద్దాపురం ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారు. ఇక,సినీ ప్రముఖుడు శివాజీ రాజా సైతం ఈ రోజు వైసిపి లో చేరాలని నిర్ణ యించారు. విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు సైతం వైసిపి కండువా కప్పుకోనున్నారు.
10.20 గంటలకు తొలి జాబితా..
ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల తొలి అధికారిక జాబితా వైసిపి ఈ రోజు విడుదల చేస్తోంది. ఉదయం 10.20 గంట లకు ఈ జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. అయితే టిడిపి..జనసేన అభ్యర్దుల విషయంలో తీసుకొనే నిర్ణయాలను సైతం పరిగణలోకి తీసుకొని మొత్తం అభ్యర్ధుల లిస్టు విడుదల చేయాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా..సిట్టింగ్‌ల్లో సీట్లు ఖరారైన వారితో పాటుగా మరి కొంత మంది తో కలిపి మొత్తం 75 మంది వరకు తొలి జాబితా లో ప్రకటించే అవకాశం ఉంది. దీని తరువాత మరో రెండు విడత లుగా వైసిపి తమ అభ్యర్ధులను ప్రకటించనుంది. అదే విధంగా ఎంపీల అభ్యర్దుల విషయంలోనూ ప్రకటన ఉంటుందని వైసిపి నేతలు చెబుతున్నారు. వైసిపి లిస్టు విడుదల చేస్తుండటంతో ఆ పార్టీ ఆశావాహుల్లో ఉత్కంఠ మొదలైంది.












Click it and Unblock the Notifications