అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కొంగజపం.. అప్పుడు స్టీపెన్ రవీంద్ర.. ఇప్పుడు అచ్చెన్నాయుడు.. విజయసాయి ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ పోరు హీటెక్కిస్తోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీ నేతల మధ్య మాటల పోరు తీవ్ర స్థాయికి చేరింది. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడుపై వైఎస్ఆర్ సీపీ విజయసాయిరెడ్డి ఫైరయ్యారు. చంద్రబాబును కొంగ జపం అని.. అచ్చెన్నాయుడిని మరో బాబు అంటూ విమర్శించారు.

బాబుపై విజయసాయి పైర్

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఆయన కొంగజపం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేపల కోసం కొంగలా అంటూ కామెంట్ చేశారు. మరీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని అడిగారు. అప్పుడు పట్టని ప్రజలు/ ప్రజా సమస్యలు ఇప్పుడు కనిపిస్తున్నాయా అని అడిగారు. ఈ మేరకు వరస ట్వీట్లతో విమర్శలు చేశారు.

పక్కదోవ పట్టిన నిధులు

పక్కదోవ పట్టిన నిధులు

గత ప్రభుత్వ హయాంలో లెక్కలేనితనంగా నడుచుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. దేవాదాయ శాఖ నిధులను పక్కదోవ పట్టించారని విమర్శించారు. తనకు నచ్చిన కొందరికీ గ్రాంట్లుగా ఇచ్చారని పేర్కొన్నారు. ఆలయాలపై దండయాత్ర కొనసాగిందని గుర్తుచేశారు. అప్పుడు అలా ప్రవర్తించి.. ఇప్పుడు ఆలయాల పేరుతో రచ్చ చేయడం చంద్రబాబుకే చెల్లిందని విజయసాయి అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను జగన్ సర్కార్ సరిదిద్దుతోందని చెప్పారు. మంచి చేస్తే నానా యాగీ చేయడం ఏమిటని అడిగారు.

మరో బాబు అంటూ..

మరో బాబు అంటూ..


అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలను కూడా మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. స్టీపెన్ సన్‌తో చంద్రబాబు నాయుడు ఫర్ ఎవ్రీథింగ్.. ఐయామ్ విత్ యూ అని చంద్రబాబు నాయుడు అన్న వ్యాఖ్యలను పేర్కొన్నాడు. ఇప్పుడు అచ్చెన్నాయుడు వంతు వచ్చిందని తెలిపారు. అందుకోసమే అప్పన్నకు ఫోన్ చేసి అచ్చెన్నాయుడు మాట్లాడాడని గుర్తుచేశారు. అన్యాయం జరిగిందని.. ఇకపై బాగా చూసుకుంటా అని అచ్చెన్నాయుడు తెలిపాడని చెప్పారు. ఇదీ అచ్చం చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ తలపిస్తోందని చెప్పారు. అధినేత/ నేత ఓకేలా ఎలా మాట్లాడతారని అడిగారు. దీనిని బట్టి వారిద్దరూ ఒకటేనని అర్థమవుతోందని చెప్పారు.

English summary
ysrcp mp vijaya sai reddy slams chandra babu naidu and Atchannaidu on panchayat elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X