ఘోరం: కాళ్లు, చేతులు కట్టేసి.. కట్టుకున్న భార్యపై స్నేహితులతో కలిసి గ్యాంగ్‍రేప్
అనంతపురం: హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే అనంతపురం జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై కట్టుకున్న భర్తే, తన స్నేహితులతోపాటు కలిసి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాళ్లు, చేతులు కట్టేసి..
అనంతపురం జిల్లాలోని కదిరికి చెందిన మల్లేష్ పూటుగా మద్యం సేవించి తన స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె చేతులు కాళ్లు కట్టేసి దారుణానికి పాల్పడ్డారు.

ప్రతిఘటించడంతో గోళ్లతో రక్కి... రక్తం కారుతున్నా..
ఆమె ప్రతిఘటించడంతో ఆమెను గోళ్లతో రక్కారు. రక్తం కారుతున్నా.. ఈ కామాంధులు ఆమెపై అఘాయిత్యాన్ని కొనసాగించారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు. ప్రస్తుతం బాధితురాలు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కట్టుకున్న భర్తే ఇంతటి దారుణానికి పాల్పడటంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది.

పరారీలో నిందితులు
చివరకు అంగన్వాడీ సిబ్బందితో కలిసి బాధితురాలు ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు మల్లేష్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

గతంలో రేప్ చేసి జైలుకెళ్లిన మల్లేష్..
కాగా, మల్లేష్ గతంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటనలో జైలుకు వెళ్లడం గమనార్హం. జైలు శిక్ష అనుభవించినా మల్లేష్‌లో ఎలాంటి మార్పూ రాలేదు. అంతేగాక, కట్టుకున్న భార్యపైనే స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications