ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా జ‌న‌ర‌ల్ కేట‌గిరీ నుండి ఈ స్థానం ఎస్సీకుల రిజ‌ర్వ్ అయింది. పూర్వం ఉన్న మ‌డ‌క‌శిర‌, అమ‌రాపురం, గుదిబండ‌, రోల్ల‌,అగ‌లి మండ‌లాలు ఇందులో కొన‌సాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ప్ర‌స్తుత పిసిసి చీఫ్ ర‌ఘువీరారెడ్డి ఇక్క‌డి నుండి మూడు సార్లు గెలిచారు. ఇక్క‌డ 2009 లో రిజ‌ర్వ్ కావ‌టంతో క‌ళ్యాణ దు ర్గం నుండి పోటీ చేసి గెలిచారు. సుదీర్ఘ కాలం మంత్రిగా ప‌ని చేసారు.ర‌ఘువీరా కు ముందు ఇక్క‌డ నుండి కాంగ్రెస్ అభ్య ర్దులుగా తిమ్మారెడ్డి రెండు సార్లు, ఎల్ల‌ప్ప ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్దిగా సుధాక‌ర్ గెల‌వ‌గా .. 2014 ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డి స‌మీక‌రాణాల్లో మార్పులు మొద‌ల‌య్యాయి. 2014 లో గెలిచిన అభ్య‌ర్ది హైకోర్టు తీర్పు ద్వారా త‌న అభ్య‌ర్దిత్వాన్ని కోల్పోయి..వైసిపి ఎమ్మెల్యే గెలిచారు.

13 సార్లు ఎన్నిక‌లు..
మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తంగా 13 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఎనిమిది సార్లు,టిడిపి మూడు సార్లు, స్వ‌తంత్ర పార్టీ ఒక‌సారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. ఇక్క‌డ గెలిచిన రుక్మిణీ దేవి హిందూపూర్ , శింగ‌న‌మ ల ల్లో కూడా గెలిచారు. కొద్ది కాలం అంజ‌య్య క్యాబినెట్‌లో ప‌ని చేసారు. ఒక‌సారి గెలిచిన న‌ర్సేగౌడ కొంత కాలం ఎన్టీఆర్ క్యాబినెట్ లో కొన‌సాగారు. మ‌డ‌క‌శిర లో రెండు సార్తు గెలిచిన తిమ్మారెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డి తండ్రీ..కుమారులు.

#AndhraPradeshElections2019: All about Madakasira Constituency

2014 లో టిడిపి గెలుపు..కోర్టు తీర్పుతో వైసిపి గెలుపు..
2004 ఎన్నిక‌ల్లో మ‌డ‌క‌శిర లో మొత్తం ఓట్లు 188212 ఉండ‌గా, అందులో 157113 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన ఈర‌న్న‌కు 76741 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన తిప్పేస్వామికి 62629 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది ఈర న్న 14712 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఇక్క‌డ గెలిచిన ఈ ర‌న్న 2009 లో టిడిపి అభ్య‌ర్దిగా ఓడిపోయారు. ఇక‌, 2014 లో గెలిచినా ఆయ‌న పై వైసిపి అభ్య‌ర్ది కేసు దాఖ‌లు చేసారు. ఆ కేసులో ఈర‌న్న గెలుపును కొట్టివేసిన హైకోర్టు త‌రువాతి స్థానం లో ఉన్న వైసిపి అభ్య‌ర్ది తిప్పేస్వామిని అక్క‌డ ఎమ్మెల్యేగా ప్ర‌క‌టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+