ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

ప్ర‌ముఖ ఆధ్మాత్యిక కేంద్ర పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం 2009 లో ఏర్పాటైంది. ర‌ద్ద‌యిన గోరంట్ల స్థానంలోని ఆరు మండ‌లా ల‌తో పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. బుక్క‌ప‌ట్నం, కొత్త‌చెరువు, పుట్ట‌ప‌ర్తి, న‌ల్ల‌మ‌డ‌, ఓడిచెరువు, ఆమ‌డుగూరు మండాల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. జిల్లాలో గ‌తంలో ఉన్న గోరంట్ల‌..న‌ల్ల‌మ‌డ నియోజ‌క‌వ‌ర్గాలు 2009 లో రద్దు అయ్యాయి. గోరంట్ల నియోజ‌క‌వ‌ర్గం నుండి రెండు సార్లు గెలిచిన నిమ్మ‌ల కిష్ట‌ప్ప గ‌తంలో మంత్రిగా ప‌ని చేసారు. ఎంపీ గా కొన‌సాగుతున్నారు. ఇక‌, న‌ల్ల‌మ‌డ నుండి కె రామ‌చంద్రారెడ్డి ఆరు సార్లు గెలిచారు. ఒక సారి లోక్‌స‌భ కు ఎన్నిక య్యారు. రెండు సార్లు గెలిచిన ఆగిశం వీర‌ప్ప చెన్నారెడ్డి, అంజ‌య్య‌, భ‌వ‌నం, కోట్ల క్యాబినెట్ లో ప‌ని చేసారు. ఇక‌, 2009 నుండి పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన త‌రువాత సమీక‌ర‌ణాల్లో మార్పు వ‌చ్చింది.

పుట్ట‌ప‌ర్తిలో రెండు సార్లు ఎన్నిక‌లు..
2009 లో ర‌ద్దు అయిన గోరంట్ల‌లో ప‌ద‌కొండు సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో ఆరు సార్లు కాంగ్రెస్ గెల‌వ‌గా.. నాలు గు సార్లు టిడిపి గెలిచింది. ఇక‌సారి స్వ‌తంత్ర అభ్య‌ర్ది గెలుపొందారు. ఇక‌, న‌ల్ల‌మ‌డ నియోజ‌క‌వ‌ర్గంలో అయిదు సార్లు కాంగ్రెస్ గెల‌వ‌గా.. నాలుగు సార్లు టిడిపి, ఒక సారి స్వ‌తంత్ర అభ్య‌ర్ది గెలిచారు. 2009 లో ఏర్ప‌డిని పుట్ట‌ప‌ర్తి నియోజ‌క వ‌ర్గం లో రెండు సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో రెండు సార్లు టిడిపి గెలిచింది.

#AndhraPradeshElections2019: All about Puttaparthi Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం లో మొత్తంగా 186276 ఓట్లు ఉండ‌గా, అందులో 152659 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన ప‌ల్లె ర‌ఘునాధ‌రెడ్డికి 76916 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన సోమ‌శేఖ‌ర రెడ్డికి 69946 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది ప‌ల్లె ర‌ఘునాధ రెడ్డి 6964 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్క‌డ గెలిచిన త‌రువాత ప‌ల్లె ర‌ఘునాధ రెడ్డి చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వి నిర్వ‌హించారు. 2017 లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ లో మంత్రి ప‌ద‌వి కోల్పోయి చీఫ్ విప్ గా నియ‌మితుల‌య్యారు. ప‌ల్లె స్థానంలో రాయ‌దుర్గం నుండి గెలిచిన కాల్వ శ్రీనివాసు ల‌ను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+