• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుని జైలుకు పంపే ప్రయత్నాల్లో జగన్ ... జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

|

ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా యూటర్న్ తీసుకుని జగన్ మావాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న జెసి దివాకర్ రెడ్డి మరోమారు తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 చంద్రబాబుని జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న జేసీ

చంద్రబాబుని జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న జేసీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వం వైపు నుంచి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ని జైలుకు పంపించే ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి .అంతేకాదు ఇక ఇందులో బిజెపి పాత్ర ఉందో లేదో తాను సరిగ్గా చెప్పలేనని, వైసిపి ప్రభుత్వ తీరు చూస్తే చంద్రబాబు ని టార్గెట్ చేసుకొని ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బస్సుల పర్మిట్లు రద్దు చేసినా జగన్ మా వాడే అంటున్న జేసీ

బస్సుల పర్మిట్లు రద్దు చేసినా జగన్ మా వాడే అంటున్న జేసీ

ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో,ఆయన కుటుంబ సభ్యులతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పిన జెసి దివాకర్ రెడ్డి, తన బస్సులకు పర్మిట్లు రద్దు చేసినప్పటికీ జగన్ మా వాడే అంటూ చెప్పుకొచ్చారు. 100కు 150 మార్కులు వేశానని చెప్పారు. ఇక వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో బాబుతో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించానని చెప్పిన జెసి దివాకర్ రెడ్డి తనదైన స్టైల్లో బాబు ని ఏం అడిగారో కూడా చెప్పుకొచ్చారు.

జైలుకు పంపే యత్నాలపై చంద్రబాబుతో జేసీ సంభాషణ

జైలుకు పంపే యత్నాలపై చంద్రబాబుతో జేసీ సంభాషణ

ఏం బాబూ ఎప్పుడు లోపలికి వెళ్లేది అని చంద్రబాబును అడిగాను అన్నారు. ఇక దానికి సమాధానంగా చంద్రబాబు నేను లోపలికి పోను దివాకర్ రెడ్డీ, వీళ్లు నన్నేమీ చేయలేరు అని చెప్పారు. నేను ఏ విషయాన్ని దాచుకోను. అందుకే చంద్రబాబును అడిగితే ఆయన నేనేమీ తప్పు చేయలేదు, నాకేమీ కాదు అని ధీమా వ్యక్తం చేశారని జేసీ దివాకర్ రెడ్డి వారిరువురి మధ్య జరిగిన సంభాషణ వివరించారు.అప్పట్లో అమాయకుడైన జగన్ ను చంద్రబాబు, సోనియా అందరూ కలిసి జైల్లో వేశారని, జగన్ పై నమోదైన కేసుల విషయంలో చంద్రబాబు పాత్ర ఉందని వైసీపీ వాళ్లు అనుకుంటుంటారని వెల్లడించారు.

జగన్ కోపం సహజం .. చంద్రబాబుకు జైలుకు పంపే ఆలోచన అందుకే అన్న జేసీ

జగన్ కోపం సహజం .. చంద్రబాబుకు జైలుకు పంపే ఆలోచన అందుకే అన్న జేసీ

వైసీపీ నేతలు అనుకునే దానిలో నిజం ఎంతో తనకు తెలియదు కానీ, చంద్రబాబు విషయంలో జగన్ కు కోపమో, తాపమో ఉండడం సహజమేనని, అతని ఆవేశాన్ని తాను తప్పుబట్టడంలేదని కూడా పేర్కొన్నారు జెసి దివాకర్ రెడ్డి . అంతేకాదు జగన్ పుట్టిపెరిగిన వాతావరణం, అతను పీల్చిన గాలి, చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రకారం జగన్ లో చంద్రబాబు ను జైలుకు పంపించాలన్న అభిప్రాయం ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయంలో సానుకూలంగా మాట్లాడుతున్న జెసి దివాకర్ రెడ్డి ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్తున్న పరిస్థితి. ట్రావెల్స్ బస్సులు సీజ్ చేసిన, పర్మిట్లు రద్దు చేసినప్పటికీ జగన్ తారసపడితే తప్పక మాట్లాడతానని జెసి బ్రదర్ చెప్పడం గమనార్హం.

English summary
JC Diwakar Reddy, who has made sensational comments on the recent political upheaval in the AP and has been a pioneer has sparked an interesting debate in political circles. Senior leader JC Diwakar Reddy said there were serious attempts to send TDP chief Chandrababu to jail. He made these sensational comments in a recent interview with a media channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X